
మహిళలను పీరియడ్స్ ప్రతి రోజూ పలకరిస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్స్ సమయంలో మహిళల తలనొప్పి, శరీర నొప్పి, రక్త స్రావం, నిద్రలేమి వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల కారణంగా, మహిళల లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది. దీనికి తోడు, ఈ పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు కామన్ గా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పుల కారణంగా... అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాడే ఫ్యాడ్స్, వేసుకునే ముందు, తీసుకునే ఆహారం విషయంలో అస్సలు తప్పులు చేయకూడదు. మరి, అవేంటో చూద్దామా....
పీరియడ్స్ సమయంలో దాదాపు అందరూ ప్యాడ్స్ ఉపయోగిస్తారు. ఆ ప్యాడ్స్ ని రేయాన్ లేదా కాటన్ మెటీరియల్ తో తయారు చేస్తారు. కానీ, వాటిలో ప్రమాదకరమైన రసాయనాలు, పురుగు మందులు ఉంటాయి. ఇవి మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వాటిలో ఉండే డయాక్సిన్ జననేంద్రియాల కణజాలాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా, ఇతర జననేంద్రియ సమస్యలు కూడా రావడం ప్రారంభిస్తాయి. దీనిని నివారించడానికి, ఆర్గానిక్ కాటన్ తో తయారు చేసిన ప్యాడ్స్ వాడటం మంచిది.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్యాడ్‌ల గురించి సదరు కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ ఉంటాయి . 12 గంటలు మా ప్యాడ్ వాడొచ్చని, 8 గంటలు వాడినా నో లీకేజ్ ప్రాబ్లం అని ఇలా చాలా చెబుతూ ఉంటారు. అది నిజమని నమ్మి, వాటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తారు. అయితే, ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది . అందుకే.. ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. మీరు ప్రతి 4 నుండి 8 గంటలకు ప్యాడ్‌లు లేదా టాంపూన్‌లను మార్చాలి. మీరు ఎక్కడికైనా బయటకు వెళుతుంటే మీరు మెన్స్ట్రువల్ కప్‌ను ఉపయోగించవచ్చు. మీరు దానిని 12 గంటల వరకు ధరించవచ్చు.
పెర్ఫ్యూమ్‌లను ఉపయోగించడం..
పీరియడ్స్ సమయంలో రక్త స్రావం జరిగి.. మన నుంచి దుర్వాసన వస్తుందేమో అనే భయంతో చాలా మంది.. ఆ ప్రదేశంలో పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటిని వాడటం మీ చర్మానికి మంచిది కాదు, ఎందుకంటే ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్లు , ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
కొంతమంది మహిళలు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. దీనిని నివారించడానికి, వారు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఈ కాలంలో తీసుకునే పెయిన్ కిల్లర్లు చాలా ప్రమాదకరమైనవి. గుండెపోటుకు కారణమవుతాయి. దీనితో పాటు, ఈ మందులు అల్సర్లు, మూత్రపిండాలు, కాలేయం , పేగు సమస్యలను కలిగిస్తాయి. వీటి కారణంగా, శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. దీనిని నివారించడానికి, మందులకు బదులుగా సహజ చిట్కాలను స్వీకరించండి.
స్త్రీలు పీరియడ్స్ సమయంలో తమ దినచర్యను కూడా మార్చుకుంటారు. ముఖ్యంగా వారు వ్యాయామానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. కానీ, పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి టాక్సిన్స్ ని చెమట రూపంలో బయటకు పంపుతుంది.