ఫ్యాబ్రిక్ గాజులు...
అమ్మాయిలు గాజులు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్, మోడల్స్ కోరుకుంటున్నారు. కాబట్టి... థ్రెడ్ బ్యాంగిల్స్ మాదిరిగా.. ఫ్యాబ్రిక్ గాజులు కూడా తయారు చేసుకోవచ్చు.
హెయిర్ యాక్సెసరీస్...
మీ దగ్గర ఉన్న జాకెట్ ముక్కలు డ్రెస్ కి కంఫర్ట్ గా లేవు అనిపిస్తే.. మీరు వాటితో హెయిర్ యాక్సెసరీస్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్క్రంచీస్ తయారు చేయచ్చు. ఒక్క జాకెట్ ముక్కతో నాలుగైదు తయారౌతాయి. మీ ఫ్రెండ్స్ కి కూడా వాటిని గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. చాలా ట్రెండీగా కూడా కనపడతారు.
పిల్లో కవర్స్...
దాదాపు అందరూ.. ఇంట్లో ఉన్న దిండ్లకు, కుషన్స్ కి కవర్స్ బయట కొంటూ ఉంటారు. అలా కొనాల్సిన అవసరం లేకుండా.. మీరు మీకు నచ్చిన జాకెట్ ముక్కతో దిండుకు కవర్ లాగా కుట్టేయచ్చు. రెండు, మూడు కలిపి డిజైన్ లా మార్చి కూడా మీరు ట్రై చేయవచ్చు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి.