Skin Allergies: గోల్డ్ రేట్లు పెరిగిపోవడంతో ఇప్పుడంతా సిల్వర్, ఇమిటేషన్ జ్యూవెలరీని ఎంచుకుంటున్నారు. కానీ చాలా మందికి గిల్టు నగలు పడవు. మెడ నల్లగా అయిపోవడం, ఎలర్జీ రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలా చేస్తే ఇకపై ఏ భయం లేకుండా కవరింగ్ నగలు వేసుకోవచ్చు.
అందరూ మెరిసిపోయే బంగారు నగలు వేసుకోలేరు. కొనుక్కునే స్థోమతా ఉండదు. దానికి తోడు ఈ రేట్లు ఆకాశానికి పెరిగిపోవడంతో సిల్వర్ జ్యూవెలరీ, వన్ గ్రాము గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ అని వాటిని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అందరికీ ఈ గిల్టు నగలు పడవు. చైన్ వేసుకుంటే మెడ నల్లగా అయి దురద వచ్చేస్తుంది. చెవులకు రింగులు పెట్టుకుంటే చీము పట్టేయడం, రక్తం కారడం, దురద ఇలాంటి వస్తుంటాయి. అందుకే గిల్టు నగలు వేసుకోవాలన్నా ఈ భయంతో పెట్టుకోరు. కానీ అలాంటి వారు కూడా ఇకపై ఏ బెంగ లేకుండా వాడుకోవచ్చు. 'ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్' మీ చర్మంపై కోటింగ్ వేయండి. ఇది గిల్టు లోహానికి, మీ చర్మానికి మధ్య ఒక పొరలా ఉండి అలర్జీ రాకుండా చేస్తుంది.
26
మాయిశ్చరైజర్ రక్షణగా పనిచేస్తుంది
మరో టిప్ ఏంటంటే..నగలు వేసుకునే ముందు చెవులకు, మెడకు కాస్త ఎక్కువగా మాయిశ్చరైజర్ లేదా వాసెలిన్ రాయండి. ఇది గిల్టు నగల్లో ఉండే నికెల్... చెమటతో కలిసి అలర్జీ రాకుండా అడ్డుకుంటుంది. దీంతో మీరు హ్యాపీగా గిల్టు నగలు వేసుకోవచ్చు.
36
ప్లాస్టిక్ స్లీవ్స్ ట్రై చేయండి
చెవిపోగుల కాడ చెవిలోకి గుచ్చుకున్నప్పుడే అలర్జీ ఎక్కువవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మెడికల్ షాపుల్లో దొరికే చిన్న ప్లాస్టిక్ 'ఇయరింగ్ స్లీవ్స్' కొని, వాటిని పోగుల కాడలకు తగిలించి పెట్టుకోండి. లేదా ప్లాస్టిక్ స్టాపర్స్ వాడండి.
చెమట, గిల్టు లోహం కలిసినప్పుడే అలర్జీ తీవ్రమవుతుంది. అందుకే నగలు పెట్టుకునే చోట కొద్దిగా యాంటీ-ఫంగల్ పౌడర్ (Anti-fungal powder) లేదా మామూలు టాల్కమ్ పౌడర్ రాసుకోండి. నగలు వేసుకునే చోట ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి.
56
ఎక్కువ సేపు పెట్టుకోవద్దు
మీది సెన్సిటివ్ స్కిన్ అయితే, గిల్టు నగలను 5నుంచి 6 గంటల కంటే ఎక్కువ సేపు పెట్టుకోవద్దు. ఫంక్షన్ అయిపోగానే వెంటనే నగలు తీసేసి, అక్కడ చల్లటి నీటితో కడిగి కొబ్బరి నూనె రాసుకోండి. కాస్త హాయినిచ్చి ఎలాంటి ఇన్‍ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది.
66
మెటల్‍కు బదులు ఫ్యాబ్రిక్, థ్రెడ్ నగలు
మెటల్ నగలు అస్సలు పడని వాళ్లు, సిల్క్ థ్రెడ్ (Silk Thread) నగలు, టెర్రకోట (Terracotta) లేదా బట్టతో చేసే 'ఫ్యాబ్రిక్' నగలను ఎంచుకోవచ్చు. ఇవి అలర్జీ సమస్య లేకుండా, మీకు మంచి మోడరన్ లుక్ ఇస్తాయి.