Telugu

బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ ఒక్క పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ

Telugu

మింట్ గ్రీన్ పాసా

మామూలుగా బక్రీద్ రోజు ఆకుపచ్చ రంగు డ్రెస్సులే వేసుకుంటారు. సో దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వాలంటే ఈ మింట్ గ్రీన్ పాసా మంచి ఛాయస్. జిర్కాన్ లుక్‌తో పాటు కుందన్ వర్క్ కూడా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

మోతీ పాసా డిజైన్

ఏ ఆభరణానికైనా ముత్యాల డిజైన్ ఉంటే ఒక స్పెషల్ లుక్ వస్తుంది. ఈ మోతీ పాసా డిజైన్‌లో కుందన్‌తో పాటు ముత్యాల లటకన్ కూడా ఉండటంతో ప్రత్యేకంగా ఉంటుంది. గరారా, షరారాపై అదిరిపోద్ది.

Image credits: pinterest
Telugu

ఝుమ్కా లటకన్ పాసా

ఈ మధ్య పాపిడి బిళ్లతో పాటు పాసా పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఝుమ్కా లటకన్ పాసాతో పాటు లైట్‌వెయిట్ జ్యువెలరీ ధరిస్తే లుక్ అదిరిపోతుంది. 

Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ పాసా డిజైన్

ఈ గోల్డ్ ప్లేటెడ్ పాసా డిజైన్‌లో చిన్న తెల్ల రాళ్లతో పాటు పింక్ రంగు రాళ్లు కూడా ఉన్నాయి. గోల్డ్ జ్యువెలరీతో పాటు ఇలాంటి పాసాను కూడా మీరు ఉపయోగించవచ్చు.
Image credits: pinterest
Telugu

అమెరికన్ డైమండ్ పాసా

నిజమైన వజ్రంలా మెరిసే ఈ అమెరికన్ డైమండ్ పాసా చూడటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఇది మీ సింపుల్ లుక్‌ను కూడా రాయల్ లుక్‌గా మార్చేస్తుంది.
Image credits: pinterest
Telugu

మోతీ లటకన్ పాసా డిజైన్

తక్కువ ధరలో రాయల్ లుక్ కావాలంటే, బక్రీద్ పండక్కి ముత్యాల లటకన్ ఉన్న పాసా పెట్టుకోవచ్చు. ఇందులో ముత్యాలు, చైన్ల వరుసలు చాలా బాగుంటాయి. 

Image credits: pinterest

Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు

Kashmiri Jhumkas: ట్రెడిషనల్.. మోడ్రన్ లుక్ తో మగువల మనసు దోచే కశ్మీరీ ఝుంకాలు

Blouse Design:పట్టుచీరలకు అదిరిపోయే బ్లౌజు డిజైన్స్ ట్రెండింగ్ మోడల్స్

Beads Mangalsutra: పెండెంట్ అవసరమే లేని మంగళసూత్రాలు