Hair Care: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ తమ జుట్టును హైడ్రేటెడ్ , మృదువుగా ఉంచుకోవడానికి కండిషనర్లు వాడుతూ ఉంటారు. ఆ కండిషనర్లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
వాతావరణంలో అధిక కాలుష్యం, సరైన పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అంతేకాదు నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి చాలా మంది బ్యూటీషియన్ల సలహా మేరకు షాంపూలు, కండిషనర్లు మారుస్తూ ఉంటారు. ఖరీదైన షాంపూ, కండిషనర్లు వాడితే.. జుట్టు అందంగా మారుతుందనే భ్రమ చాలా మందిలో ఉంటుంది.కానీ, కెమికల్స్ తో నిండి ఉన్న వాటిని వాడటం వల్ల జుట్టు అందంగా మారడం కాదు... మరింత ఎక్కువ డ్యామేజ్ చేసేస్తాయి. అయితే, సహజంగా ఇంట్లోనే కండిషనర్ తయారు చేసుకొని దానిని వాడితే... మీ జుట్టు చాలా స్మూత్ గా, పట్టుకుచ్చులా మారుతుంది.
24
బాదం, మందార హెయిర్ కండిషనర్....
బాదం పప్పు, మందార పూలు రెండూ... మీ జుట్టును అందంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటితో కండిషనర్ తయారు చేసుకోవడానికి ముందుగా... ఒక కప్పు బాదం పేస్టు తయారు చేసుకోవాలి. ఒక కప్పు మందార పూలను కూడా తీసుకోవాలి. పువ్వు రెమ్మలు మాత్రమే తీసుకోవాలి. ఈ మందార పూల రెమ్మలను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. ఉదయం ఈ పూలను, బాదం పేస్టు మొత్తం కలిపి మెత్తని మిశ్రమంలా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు జుట్టుకు మంచిగా అప్లై చేయాలి. 30 నిమిషాలు అలానే ఉంచి... తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీ జుట్టు హైడ్రేటెడ్ గా మారుతుంది.
34
గుడ్డు, అరటి పండు కండిషనర్...
ముందుగా, ఒక చిన్న గిన్నెలో గుడ్డును బాగా గిలకొట్టాలి. అరటిపండును బాగా మెత్తగా చేసి జోడించండి. దీనికి కొద్దిగా తేనె , ఆలివ్ నూనె వేసి బాగా కలపండి. అంతే కండిషనర్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. సల్ఫేట్ లేని షాంపూ తో తలస్నానం చేయాలి. ఈ కండిషనర్ తో జుట్టు అందంగా కనపడుతుంది.
మీ జుట్టు ఎల్లప్పుడూ తేమగా ఉండాలని మీరు కోరుకుంటే, కొబ్బరి పాలు , తేనెతో తయారు చేసిన కండిషనర్‌లను ఉపయోగించండి. ఒక చిన్న గిన్నెలో కొబ్బరి పాలు తీసుకోండి. దానికి కొద్దిగా తేనె , శనగపిండి వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. దీన్ని మీ జుట్టు చివరల నుండి మూలాల వరకు అప్లై చేసి, ఆపై మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఇది మీ జుట్టు ఎల్లప్పుడూ మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.