Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయా? ఇదొక్కటి రాసినా తగ్గిపోతాయి..!

Published : Jul 25, 2025, 11:02 AM IST

కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేసిన ఐ మాస్క్ వాడటం వల్ల.. ఈ డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

PREV
14
dark circles

ప్రస్తుత కాలంలో చిన్న వయసులో చాలా మంది మహిళలు, పురుషులు కంటి కింద డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం, పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాలు కూడా డార్క్ సర్కిల్స్ కి కారణం అవుతాయి. చాలా మంది.. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో ఐక్రీములు వాడుతూ ఉంటారు. అయితే.. అవేమీ అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దాని కోసం.. మన ఇంట్లో లభించే పదార్థాలతో కంటి కింద మాస్క్ లాగా వేస్తే చాలు.

24
ఐ మాస్క్..

కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేసిన ఐ మాస్క్ వాడటం వల్ల.. ఈ డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఈ ఐ మాస్క్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

కావాల్సిన పదార్థాలు...

నీరు – 1 చెంచా

కాఫీ పొడి – ½ చెంచా

కలబంద జెల్ – ½ చెంచా

కాస్టర్ ఆయిల్ – 2-3 చుక్కలు

34
ఆముదం-కాఫీ ఐమాస్క్..

తయారీ విధానం:

ముందుగా నీరు , కాఫీ పొడిని కలపండి.ఆ తర్వాత కలబంద జెల్, ఆముదం వేసి బాగా కలపండి.ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద నల్లటి వలయాలపై అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ దీనిని రాయడం వల్ల నెల రోజుల్లో మీకు తేడా క్లియర్ గా కనపడుతుంది.

ఆముదం మన ముఖానికి మంచి తేమను అందిస్తుంది. వాపు తగ్గిస్తుంది. ఇక.. కాఫీ పొడి రక్త ప్రసరణను మెరుగు పరిచి.. నలుపు తగ్గిస్తుంది. ఇక.. కలబంద జెల్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖాన్ని యవ్వనంగా మారుస్తుంది.

44
అదనపు చిట్కాలు:

ప్రతిరోజూ ఐస్ ప్యాక్‌ను కళ్లపై ఉంచండి.

కనీసం 7–8 గంటల నిద్రపోయండి.

అధిక ఉప్పు, చక్కెర తీసుకోవడం తగ్గించండి.

బాదం నూనెతో మృదువుగా మసాజ్ చేయండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

గమనిక: కంటి కింద ఏదైనా మాస్క్ ఉపయోగించే ముందు... ప్యాచ్ టెస్టు చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ సహజ చికిత్సలు పాటిస్తే, నల్లటి వలయాలు త్వరగా తగ్గిపోతాయి. అందమైన, ఆరోగ్యవంతమైన కళ్ళ కోసం ఈ చిట్కాలను పాటించండి.

Read more Photos on
click me!

Recommended Stories