చర్మ రకాన్ని బట్టి ప్రొడక్ట్స్ వాడటం...
సెలబ్రెటీలు వాడేవి, మార్కెట్లో బాగా పాపులర్ అయినవి కొనేసి రాసేస్తూ ఉంటారు. అలాంటి పొరపాటు చేయకూడదు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రొడక్ట్స్ సరిపోతాయి.చర్మ నిపుణుల సలహా తీసుకొని మరీ.. మీ స్కిన్ కి సూట్ అయ్యేవి మాత్రమే ఎంచుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారాలు తినండి..
మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యం, మన జుట్టు , మన చర్మంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ చర్మంలో తేమను కాపాడుకోవడానికి మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోండి. అవును, మీరు ప్రాసెస్ చేసిన లేదా జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే , తగినంత నీరు త్రాగకపోతే, ఇవన్నీ మీ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా, మీ చర్మం పొడిగా మారుతుంది.