అందాన్ని పెంచుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం.. చాలా మంది ఖరీదైన క్రీములు, ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు.కానీ.. ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండటం లేదు అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. చిన్న వయసులోనే ముఖంలో కళ తప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాలుష్యం, మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మాన్ని దెబ్బతీస్తాయి.కానీ.. పెద్దగా ఖర్చు పెట్టకుండా కూడా.. మనకు సహజంగా లభించే ఒకే ఒక్క ఆకును ముఖానికి వాడటం వల్ల మనం అందంగా మెరిసిపోవచ్చని మీకు తెలుసా? మరి, ఆ ఆకు ఏంటి? దానిని ఎలా వాడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
24
బొప్పాయి ఆకు..
మనకు బొప్పాయి పండు ఎంత ఈజీగా లభిస్తుందో... బొప్పాయి ఆకు కూడా అంతే సులభంగా లభిస్తుంది. బొప్పాయి పండు మన ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఎంత సహాయపడుతుందో.. ఈ బొప్పాయి ఆకు కూడా.. మన అందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఆకులతో ఫేస్ మాస్క్ తయారు చేసుకుంటే సరిపోతుంది.
బొప్పాయి ఆకుతో చర్మానికి ప్రయోజనాలు...
బొప్పాయి ఆకుల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ.. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడానికి సహాయపడతాయి. ఈ ఆకులను ముఖానికి వాడటం వల్ల ఫేస్ మీద నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు.. ముఖం మెరుస్తూ కనపడుతుంది.
34
బొప్పాయి ఆకుతో ఫేస్ ప్యాక్ తయారీ...
ఈ ఫేస్ ప్యాక్ తయారీకి బొప్పాయి ఆకులు, శనగ పిండి ఉంటే చాలు. ముందుగా రెండు లేదా మూడు బొప్పాయి ఆకులను శుభ్రం చేయాలి. తర్వాత దీనిని పేస్టులాగా చేయాలి. ఈ పేస్టులో శనగ పిండి వేసి.. మంచిగా కలుపుకోవాలి. అంతే.. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కనీసం వారానికి రెండు రోజులు ఈ మాస్క్ ప్రయత్నించినా చాలు. మీ ముఖం మీద నల్ల మచ్చలు తగ్గిపోతాయి.. ఫేస్ లో గ్లో వస్తుంది. సహజంగా అందంగా కనపడతారు. ఈ మాస్క్ తో పాటు.. రెగ్యులర్ గా ముఖానికి మాయిశ్చరైజర్, సన్ స్కీన్ రాయడం మర్చిపోవద్దు.
మీ చర్మం జిడ్డుగా ఉంటే, మీరు ముల్తానీ మట్టి, వేప ఆకు మాస్క్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు. వేపాకు చర్మానికి చాలా మంచిది. మొటిమల సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. దీనికోసం మీరు..2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, 1 టీస్పూన్ వేపాకు పొడి జోడించి.. రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్పలై చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ లేదా కలబంద జెల్ రాస్తే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. ముఖంలో గ్లో స్పష్టంగా కనపడుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.