మచ్చలుంటే ఎంత మేకప్ వేసినా అందంగా కనిపించరు. అయితే ఈ మచ్చలను పోగొట్టి ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి పచ్చి పాలు బాగా ఉపయోగపడతాయి. అసలు పచ్చి మన చర్మానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలుసా?
మచ్చలు లేకుండా అందమైన ముఖం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటారు. అలాగే బ్యూటీ ట్రీట్మెంటులనూ తీసుకుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా మీరు అందమైన, ప్రకాశవంతమైన ముఖాన్ని పొందొచ్చు. అదేంటో కాదు పచ్చి పాలు. అవును పచ్చిపాలతో మీరు మీ ముఖాన్ని కాంతివంతంగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
పచ్చిపాలు
పచ్చి పాలను ఎన్నో ఏండ్లుగా చర్మ సంరక్షణ దినచర్యలో ఉపయోగిస్తున్నారు. పాలకున్న ప్రత్యేకత ఏంటంటే? ఇది ఎలాంటి చర్మ రకానికైనా ఉపయోగపడుతుంది. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి చర్మానికి ఉపయోగపడుతుంది. అసలు పచ్చి పాలను ముఖానికి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం పదండి.
35
పచ్చిపాలలో పోషకాలు
పచ్చి పాలలో మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే లాక్టిక్ ఆమ్లం చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే పాలలోని యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అంతేకాదు పాలలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ముఖ రంగును మెరుగుపరుస్తుంది. పచ్చిపాలలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఇది మీ స్కిన్ యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
45
ముఖానికి పచ్చి పాలను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు
పచ్చి పాలను ముఖానికి పెడితే చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. మీ స్కిన్ డ్రై పొడిగా ఉన్నట్టైతే పచ్చి పాలను ఖచ్చితంగా పెట్టండి. ఇదొక చిన్న చిట్కానే అయినా పాలు ముఖాన్ని తేమగా ఉంచి స్మూత్ గా చేస్తాయి. పచ్చి పాలను ముఖానికి రాయడం వల్ల దానిలోని లాక్టిక్ ఆమ్లం చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. దీంతో మీ చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మెరిసిపోతుంది.
అలాగే పచ్చిపాలను ముఖానికి అప్లై చేయడం వల్ల మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ పాలు ముఖంమీదున్న మచ్చలను, ట్యానింగ్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే మీ ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది. పాలలో ఉన్న విటమిన్ ఎ యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
55
ముఖానికి పచ్చి పాలను ఎలా పెట్టాలి?
ముఖాన్ని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పడు రెండు టీ స్పూన్ల పచ్చిపాలను తీసుకుని అందులో కొంచెం తేనెను కలపండి. ఇప్పుడు దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడగడండి.