జుట్టు ఆరోగ్యం..
అంతేకాకుండా, జుట్టు సమస్యలతో బాధపడే వారికి ఇది వరంగా మారుతుంది. దీనిలోని విటమిన్ బి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇందులో ఉన్న ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందటానికి ఇది సహాయపడుతుంది.
ఎంత మోతాదులో తీసుకోవాలి..?
ఈ గింజలను నిత్యం ఒక చెంచా మోతాదులో తినడం ఉత్తమం. మీరు వీటిని పచ్చిగా, నెయ్యితో స్వల్పంగా కాల్చి లేదా ఓట్‌మీల్, స్మూతీ, సలాడ్‌లలో చేర్చుకొని తినవచ్చు. అయితే, ఏ ఆహారమైనా మితంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనం కలుగుతుంది. 'అధికంగా తీసుకుంటే అమృతం కూడా విషమే' అనే సామెతను గుర్తు పెట్టుకోవాలి. రోజూ చిన్న మోతాదులో తీసుకుంటే, శరీరానికి కావలసిన అన్ని పోషకాలూ ఈ చిన్న విత్తనాల ద్వారానే అందించవచ్చు. రోజూ మర్చిపోకుండా వీటిని తీసుకుంటే.. మీ ఆరోగ్యం కచ్చితంగా మెరుగుపడుతుంది.