ఇంట్లో ఏ గదిలో ఉన్నా లేకున్నా.. వంటగదిలో మాత్రం ఖచ్చితంగా ఎర్రచీమలు, నల్ల చీమలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ చీమల వల్ల అన్నానికి, కూరలకు, పప్పులకు మొదలైన ఆహారాలు పాడవుతుంటాయి. అందుకే ఈ చీమలు ఇంట్లో లేకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వంటింట్లో చీమలు ఉండటం సర్వ సాధారణం. కానీ వీటివల్ల ఎన్నో ఆహారాలు పాడవుతాయి. ముఖ్యంగా చక్కెర, అన్నం చీమల వల్ల పాడవుతాయి.చాలా మంది ఇంట్లో చీమలు లేకుండా చేయడానికి లక్ష్మణరేఖను వాడుతుంటారు. కానీ వీటిలో హానికరమైన కెమికల్ ఉంటుంది. ఇది చాలా డేంజర్. కాబట్టి దీన్ని వాడకపోవడమే మంచిది. దీనికి బదులుగా నేచురల్ చిట్కాలను ఉపయోగించి చీమలను తరిమికొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
బిర్యానీ ఆకు, ఉప్పు
బిర్యానీ ఆకు, ఉప్పుతో కూడా వంటింట్లో చీమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం బిర్యానీ ఆకును తీసుకుని దాన్ని చేత్తో బాగా నలపండి. దీనికి ఉప్పును కలిపి చీమలు వచ్చే ప్రదేశాల్లో పెట్టండి. తలుపులు, కిటికీల దగ్గర పెడితే చీమలు వంటింట్లోకి రాకుండా ఉంటాయి.
36
వెనిగర్
వంటింట్లో చీమలను తరిమికొట్టడంలో వెనిగర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందది. ఇందుకోసం వెనిగర్ ను, నీళ్లను సమానంగా తీసుకుని కలపండి. దీన్ని స్ప్రే బాటిల్ లో నింపండి. చీమలు ఎక్కడి నుంచైతే వస్తున్నాయో గమనించి అక్కడ స్ప్రే చేయండి. డస్ట్ బిన్, కిచెన్ కౌంటర్ వంటి ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చీమలు అస్సలు ఉండవు. వెనిగర్ వాసన చీమలకు నచ్చదు కాబట్టి వంటింట్లో చీమలు లేకుండా పోతాయి.
మిరియాల పొడితో కూడా ఇంట్లో చీమలు లేకుండా చేయొచ్చు. వీటి వాసన చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి ఇంట్లో చీమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మిరియాల పొడిని చల్లండి. దీంతో చీమలు పారిపోతాయి.
56
కాఫీ పొడి
కాఫీ పొడి కూడా చీమలను తరిమికొట్టగలదు. ఈ కాఫీ పొడి వాసన చీమలను ఏ మాత్రం నచ్చదు. అందుకే దీన్ని వాడి వంటింట్లో చీమలను లేకుండా చేయొచ్చు. ఇందుకోసం చీమలు తిరిగే చోట కాఫీ పొడిని చల్లండి.
66
ఇలా చేయండి
ఇంట్లోకి చీమలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలను కూడా పాటించండి.
- కిచెన్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాాలి. డస్ట్ బిన్ ను ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తుండాలి. అలాగే ఆహారాలను సరిగ్గా నిల్వ చేయాలి. మూతలు టైట్ గా పెట్టాలి. ఆహారం కిందపడితే వెంటనే క్లీన్ చేసేయాలి.