వృద్ధాప్య ఛాయలు తగ్గడానికి: క్యారెట్ ను ఉపయోగించి ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, గుడ్డు పచ్చసొన వేసి కలపండి.దీన్ని ముఖానికి రాస్తే ముఖ చర్మం పొడిబారడం తగ్గుతుంది. ముడతలూ పోతాయి.
క్యారెట్, శనగపిండి ఫేస్ ప్యాక్: ముఖానికి క్యారెట్, శెనగపిండి ఫేస్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్ రసంలో శెనగపిండిని వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి రాస్తే చర్మ రంగు మెరుగుపడుతుంది. అలాగే అందంగా మెరిసిపోతుంది.