Hair Care Tips For Summer: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే

Published : Mar 14, 2026, 01:44 PM IST

 Hair Care Tips For Summer: వేసవిలో చెమట, దురద , వాసనతో ప్రజలు తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఇంట్లో లభించే పదార్థంతో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? 

PREV
13
Hair Care

బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ సమ్మర్ లో మనం అనేక సమస్యలను ఎదుర్కుంటూనే ఉంటాం. చెమట, దుమ్ము, సూర్య రశ్మి, కాలుష్యం కారణంగా.. తలలో దురద, చుండ్రు, జుట్టురాలడం, జుట్టు పొడి బారడం వంటి సమస్యలు ఎదురౌతాయి. దీనిని ఎదుర్కోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా... మార్కెట్లో దొరికే ఏవేవో షాంపూలు, కండిషనర్లు వాడేస్తూ ఉంటారు. అయితే.. ఖరీదైన ఉత్పత్తులు సంబంధం లేకుండా.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. అందుకోసం మీ ఇంట్లో పెరుగు ఉంటే చాలు. మరి, ఆ పెరుగును ఎలా వాడితే.. జుట్టు అందంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం...

పెరుగుతో ప్రయోజనాలు..

పెరుగు జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది. దీనిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి5, లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. జుట్టు కుదుళ్లను కూడా బలపరుస్తాయి.

23
పెరుగును జుట్టుకు ఎలా వాడాలో తెలుసా?

1.పెరుగు, అలోవెరా జెల్..

ఎండ, చెమట కారణంగా జుట్టులో విపరీతంగా దురద వస్తుందని మీరు అనుకుంటే.. దానిని వదిలించడానికి మీరు పెరుగు వాడితే చాలు. పెరుగులో కలబంద గుజ్జు కలిపి, జుట్టు కుదుళ్లు, మూలాలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మంచిగా తేమ అందుతుంది. అంతేకాదు.. తలలో దుర్వాసన సమస్య కూడా ఉండదు. దురద కూడా తగ్గుతుంది. దీని వల్ల జుట్టు పట్టుకుచ్చులా, అందంగా కనపడుతుంది.

2.పెరుగు, మెంతులు....

తలలో దురదను, చెమట వాసన పోగొట్టడానికి మీరు పెరుగు, మెంతుల పేస్టు వాడొచ్చు. దీని వల్ల ఈ రెండు సమస్యలు తగ్గడం మాత్రమే కాదు.. జుట్టు అందంగా మారుతుంది. ముందు జుట్టురాలే సమస్య కూడా తగ్గుతుంది. తలలో వేడి కూడా తగ్గిస్తుంది.

33
3.పెరుగు, నిమ్మరసం..

మీరు మీ జుట్టుకు పెరుగు , నిమ్మరసాన్ని కూడా అప్లై చేయవచ్చు. మీరు వారానికి మూడు సార్లు అప్లై చేయవచ్చు. ఇది మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు విచ్ఛిన్నం, బలహీనమైన, నిర్జీవమైన జుట్టు , చుండ్రును శాశ్వతంగా తగ్గిస్తుంది.

4. పెరుగు , కొబ్బరి నూనె

సమ్మర్ లో జుట్టు అందంగా మార్చుకోవడంలో పెరుగు, కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడతాయి. ఇది మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టు కుదుళ్లను చాలా బలపరుస్తాయి. హెయిర్ బ్రేకేజ్ ఉండదు. జుట్టును మృదువుగా, మెరిచేలా చేస్తాయి. వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు మీ జుట్టుకు అప్లై చేస్తే చాలు. మీ జుట్టు చాలా అందంగా కనపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories