Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు, ఏ క్రీములు రాయకపోయినా అందంగా మెరిసిపోవచ్చు..!

Published : Jun 13, 2025, 01:49 PM IST

చియా సీడ్స్ వాటర్ తాగితే సహజంగానే ముఖంలో అందం పెరుగుతుంది. కానీ, చియా సీడ్స్ తో మనం ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. 

PREV
14
ఇంట్లోనే ఫేషియల్ గ్లో..

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా అమ్మాయిలు, అందంగా కనిపించేందుకు ముఖానికి ఏవేవో క్రీములు, సీరమ్స్ పూసేస్తూ ఉంటారు. కానీ, వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా.. అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుందామన్నా కూడా వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియల్ ని మించిన గ్లో తెచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

24
చియా సీడ్స్ తో అందం..

మీ అందరికీ చియా సీడ్స్ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చియా సీడ్స్ ని బరువు తగ్గడానికి వాడి ఉంటారు. కానీ, ఈ చియా సీడ్స్ తో మన అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చియా సీడ్స్ వాటర్ తాగితే సహజంగానే ముఖంలో అందం పెరుగుతుంది. కానీ, చియా సీడ్స్ తో మనం ఫేషియల్ కూడా చేసుకోవచ్చు.

34
చియా సీడ్స్ తో ఫేస్ ప్యాక్..

చియాసీడ్స్ సహాయంతో మీరు ఇంట్లోనే మీరు స్పెషల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసే విధానం కూడా చాలా సులభం. చియా సీడ్స్ ని రెండు స్పూన్లు తీసుకొని రాత్రంతా నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ చియా సీడ్స్ నీటి నుంచి వేరు చేసి, మిక్సర్ లేదా బ్లెండర్ లో వేసి మెత్తని పేస్టులాగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి పెరుగు , కలబంద గుజ్జు వేసి మంచి పేస్టులాగా చేసుకోవాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి, కాసేపటి తర్వాత ముఖానికి అప్లై చేస్తే చాలు.

44
ఎలా వాడాలంటే..

మీరు ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. దీనితో పాటు, మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు నుండి మూడు సార్లు ఉపయోగించవచ్చు. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించినప్పుడల్లా, ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఫేస్ ప్యాక్‌ను 20 నుండి 25 నిమిషాలు అప్లై చేయండి. ఆ తర్వాత మీ ముఖాన్ని నీటితో మళ్ళీ కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మీ ముఖం యవ్వనంగా కనపడుతుంది. అందం రెట్టింపు అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories