చందమామలా మెరిసే ముఖం కావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. దాని కోసం మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు తెచ్చి ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ, వాటి వల్ల ప్రయోజనం కంటే... నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. మార్కెట్లో కొనే క్రీముల ధరలు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. అయితే, పెద్దగా ఖర్చు లేకుండా.. అందాన్ని పెంచుకునే సహజ మార్గం ఉంది. దానికోసం ఇంట్లో బియ్యం పిండి, పచ్చిపాలు ఉంటే చాలు. మరి, ఈ రెండింటినీ ముఖానికి ఎలా వాడాలి? ఇవి వాడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
25
పచ్చి పాలలో ఏం కలపాలి?
పచ్చిపాలు, బియ్యం పిండి రెండూ మన అందాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ముఖాన్ని మెరిసేలా చేయడానికి, మొటిమల సమస్య రాకుండా కూడా కాపాడుతుంది. పాలల్లోని లాక్టిక్ ఆమ్లం మన చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ ని తొలగిస్తుంది. ఇక.. బియ్యం పిండి ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.
మీ ముఖానికి పచ్చిపాలు రాయడానికి ముందు, దాని ప్రయోజనాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. పచ్చిపాలలో లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో, నల్ల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ఇక బియ్యం పిండి మన చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో సహాయపడతాయి. ఇవి మొటిమల సమస్యను తగ్గించడంలో, ముఖంపై పేరుకుపోయిన జిడ్డును తొలగించడంలో సహాయపడతాయి.
35
పచ్చిపాలలో బియ్యం పిండి కలిపి రాస్తే....
ఒక గిన్నెలో 5-6 టీ స్పూన్ల పచ్చిపాలు తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలపాలి. అందులోనే కొంచెం రోజ్ వాటర్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మంచిగా అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది.
మీరు మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవాలనుకుంటే, ఒక గిన్నెలో 1 చెంచా బియ్యం పిండి, 1 చెంచా శనగ పిండి, సగం గిన్నె పచ్చి పాలు , 1 చెంచా కొబ్బరి నూనె కలపండి, ఈ ప్యాక్‌ను మీ ముఖంపై అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి, తర్వాత మీ ముఖం కడుక్కోండి. మొదటి అప్లికేషన్ తర్వాత మీ ముఖంపై మెరుపు కనిపిస్తుంది.
55
టొమాటో , బియ్యం పేస్ట్‌ను మీ ముఖంపై అప్లై చేస్తే...
మీ స్కిన్ టోన్ ఏకరీతిగా లేకపోతే, బియ్యం పిండిని టమోటా ప్యూరీతో, ఒక చెంచా పచ్చి పాలు, ½ టీస్పూన్ కలబందను కలిపి బాగా కలపండి. తయారుచేసిన ప్యాక్‌ను మీ ముఖంపై 15 నిమిషాలు అప్లై చేసి, ఆపై మీ ముఖం కడుక్కోండి. ఇది మీ ముఖానికి మెరుపు తీసుకువస్తుంది.