Face Glow: మనకు ఇంట్లో ఎర్ర కందిపప్పు చాలా సులభంగా లభిస్తుంది. ఇదే కంది పప్పు మన ముఖంలో గ్లో తీసుకువస్తుందని మీకు తెలుసా? అయితే.. ఆ కంది పప్పుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
స్కిన్ పై ముడతలు రాకుండా ఉండాలని, యవ్వనంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసమే రెగ్యులర్ గా చాలా మంది ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఖరీదైన క్రీములు రాసేస్తూ ఉంటారు. అయితే.. పార్లర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని వాళ్లు కూడా ఉంటారు. అలాంటివారు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా మెరిసిపోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే ఒక పప్పుని వాడి ఫేస్ ప్యాక్ వేసుకుంటే... కేవలం ఐదు నిమిషాల్లో ముఖంలో గ్లో పెంచుకోవచ్చు.
24
ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్
తక్కువ ఖర్చుతో అందాన్ని పెంచుకోవాలి అనుకునేవారికి ఎర్ర కంది పప్పు బెస్ట్ ఆప్షన్. ఈ పప్పు తో పాటు ముల్తానీ మట్టి, పసుపు లాంటివి కలిపి ముఖానికి రాస్తే... చాలా తక్కువ సమయంలోనే ముఖం మెరిసిపోతుంది. మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
34
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సినవి...
ఎర్ర కంది పప్పు-100 గ్రాములు, ముల్తానీ మట్టి 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, పచ్చి పాలు కొద్దిగా, వీటితో మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా.. ఎర్ర కందిపప్పు ను కాసేపు నీటిలో నానపెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముల్తానీ మట్టి, పసుపు, పచ్చి పాలు కూడా వేసి మంచి మిశ్రమంలా కలపాలి. ఈ ఫ్యాక్ ని ముఖానికి రాయడానికి ముందు.. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ముఖం కడుక్కున్న తర్వాత.. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. కనీసం 20 నిమిషాలపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాసేపటికే ముఖం మెరుస్తూ కనపడుతుంది. రెగ్యులర్ గా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమల సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. వారానికి రెండుసార్లు దీనిని రిపీట్ చేయడం వల్ల... మంచి రిజల్ట్స్ వస్తాయి.