Periods: మహిళలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో పరిశుభ్రతను పాటించకపోతే.. అనేక ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్యాడ్ వాడే విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.
పీరియడ్స్ సమయంలో మహిళలు రెగ్యులర్ గా ప్యాడ్స్ వాడటం చాలా కామన్. ప్రస్తుతం మార్కెట్లో టాంపూన్లు, డిస్పోజబుల్ ప్యాంటీలు, మెన్స్టువల్ కప్పులు వంటి అనేక ఉత్పతులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ... చాలా మంది ప్యాడ్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే... పీరియడ్ మొదటి రెండు రోజులు రక్త స్రావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో వెంట వెంటనే ప్యాడ్స్ మారుస్తారు. కానీ... నాలుగో రోజు తర్వాత బ్లీడింగ్ తగ్గుతూ వస్తుంది. దీంతో.. ఒకటే ప్యాడ్ ని కంటిన్యూ చేస్తారు. కానీ, దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
23
ప్యాడ్ ని ఎంత తరచుగా మార్చాలి?
రక్త స్రావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మారుస్తూ ఉండటం చాలా సహజం. కానీ, బ్లీడింగ్ తక్కువగా అయినప్పుడు కూడా ప్యాడ్ ని 4 గంటలకు ఒకసారి మార్చి తీరాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే... ప్యాడ్ ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... UTIలు, యోని ఇన్ఫెక్షన్లు రెండూ వస్తాయి. కాబట్టి, ప్రతి నాలుగు గంటలకు మీ ప్యాడ్‌ను మార్చడం మర్చిపోవద్దు.
అదనంగా, మార్కెట్‌లోని చాలా ప్యాడ్‌లలో రసాయనాలు ఉంటాయి. ఈ ప్యాడ్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఎండోమెట్రియోసిస్ , క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
33
పీరియడ్ ప్యాడ్స్ వల్ల కలిగే నష్టాలు...
మీరు ఒకే ప్యాడ్‌ను 4-5 గంటల కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే, అది దురద, దద్దుర్లు కలిగిస్తుంది. ఇది ల్యూకోరియా కూడా దారితీస్తుంది.
మీకు తక్కువ రక్తస్రావం ఉన్నప్పటికీ, ప్యాడ్‌లో తడిగా అనిపించకపోయినా, ప్రతి 3-4 గంటలకు దాన్ని మార్చడం ఋతు పరిశుభ్రతకు చాలా కీలకమని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే, మీరు డైరెక్ట్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించవచ్చు.