తక్కువ ధర నెయిల్ ఆర్ట్: ఇషా తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ఎంచుకుంది. వైట్ కి బదులు బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్, పాయింట్ నెయిల్స్ ఎంచుకుంది. సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా నెయిల్ ఆర్ట్ చేసింది. జూలియా ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ గురించి చెప్పింది.
జూలియా, ఇషా నెయిల్ ఆర్ట్ కోసం అప్రెస్ నెయిల్ బ్రాండ్ లో రెండు కలర్స్ ఎంచుకుంది. ఒకటి ఫర్గాటన్ ఫిల్మ్. ఇది లైట్ న్యూడ్ కలర్. ఇంకొకటి ఫ్రెంచ్ బ్లాక్. వెబ్సైట్ లో ఈ రెండు నెయిల్ కలర్స్ దొరుకుతాయి. అక్కడి సమాచారం ప్రకారం ఒక్కో నెయిల్ పాలిష్ బాటిల్ ధర 14.99 యుఎస్ డాలర్లు. అంటే దాదాపు 1,252 రూపాయలు. రెండూ కలిపి 2,504 రూపాయలు. ఇషా అంబానీ నెయిల్స్ పైన పెద్ద డిజైన్స్ ఏమీ కనిపించవు. చాలా సింపుల్ గా ఉన్న ఈ నెయిల్ ఆర్ట్ కి ఆమె 2,504 రూపాయలు ఖర్చు పెట్టింది. ఖరీదైన నగలు వేసుకున్న ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ కి మాత్రం చాలా తక్కువ ఖర్చు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.