Old Sarees: పాత చీరలేం వేస్ట్ కావు.. వీటిని ఇలా ఉపయోగిస్తే సరి

Published : Oct 04, 2025, 09:02 PM IST

Old Sarees:ఆడవాళ్లు ఎన్నో రకాల చీరలను కొంటూనే ఉంటారు. వీటిని ఒకటిరెండు సార్లు కట్టారంటే ఇక పక్కన పెట్టేస్తుంటారు. ఆడవారు కట్టుకోని చీరలన్నీ బీరువాలో కుప్పలకు కుప్పలు ఉంటాయి. అయ్యో ఇవి వేస్టేనా అని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు.  

PREV
15
పాత చీరలను తిరిగి ఎలా ఉపయోగించాలి?

ఆడవారు చీరలను కొన్నట్టు వేటినీ కొనరేమో. చాలా మంది రెండు మూడు సార్లు కట్టుకున్నారంటే ఈ చీరలను ఇక పక్కన పెట్టేస్తుంటారు. ఇలా కట్టుకోని చీరలు ఎన్నో బీరువాలో ఉంటాయి. 

వీటిని ఏం చేసుకుంటాం.. ఇక చెత్తకే అని అంటుంటారు. కానీ పాత పట్టు, సిల్క్ చీరలతో మీరు అద్బుతాలు చేయొచ్చు. అవును చీరలు అస్సలు వేస్ట్ కావు. పాతవైనా వీటితో మీరు ఇంటిని అందంగా చేయొచ్చు. లేదా తిరిగి కూడా వాడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
పాత చీరలను తిరిగి ఎలా ఉపయోగించాలి?

పాత చీరలతో కుర్తాలు

ఒకటి రెండు సార్లు కట్టుకున్న మీ పాత చీరలను మీరు కుర్తాలుగా తయారుచేసి ధరించొచ్చు. ఇందుకోసం మీరు ఇంటర్నెట్ లో వీడియోలను చూడొచ్చు. పాత చీరలతో కుర్తాలను ఎలా కుట్టాలో అందులో మీకు వివరంగా ఉంటుంది. సిల్క్ లేదా పాత పట్టు చీరలతో కుర్తాలను కుట్టించుకుని వేసుకుంటే అందంగా ఉంటారు. ఎందుకంటే వీటిలో మీ లుక్ క్లాసీగా, సాంప్రదాయంగా ఉంటుంది.

లెహంగాలు

లెహంగాల్లో లుక్ అదిరిపోతుంది. ఈ రోజుల్లో పెళ్లైన వారు కూడా లెహంగాలను బాగా ధరిస్తున్నారు. కాబట్టి వర్క్ లేదా పట్టు చీరలు పాతవి ఏవైనా ఉంటే మీకు ఇష్టమైన స్టైల్లో లెహంగాను కుట్టించుకోండి. మంచి బార్డర్ ఉన్న లెహంగా లేదా ప్లెయిన్ లెహంగా అయినా లేదా స్కర్ట్ టైప్ లెహంగా అయినా లుక్ బాగుంటుంది. పాత చీరలతో కుట్టిన లెహంగాను మీరు ప్రత్యేక సందర్భానికి వేసుకోవచ్చు. అయితే లెహంగా కుట్టడానికి ఎంత చీర పడుతుందో అంత కట్ చేసుకుని మిగతా దాన్ని టాప్ ను కట్టించుకోవడానికి ఉపయోగించండి.

35
సల్వార్ సూట్లు

చీరలతో మీరు అందమైన సల్వార్ సూట్లను కూడా కుట్టించుకుని ధరించొచ్చు. మీ దగ్గర 9 లేదా 6 గజాల పాత చీర గనుక ఉంటే దానితో అందమైన సల్వార్ సూట్ ను కుట్టించుకోండి. ఫ్యాబ్రిక్ రకం, పొడవును బట్టి మీరు రకరకాల సల్వార్ సూట్ లను కుట్టించుకోవచ్చు. అంటే పటియాలా ప్యాంట్ పైకి షార్ట్ కుర్తా లేదా చుడీదార్ ప్యాంట్ ఇలా కుట్టించుకుంటే లుక్ అదిరిపోతుంది.

పాత చీరలతో దుపట్టాలు

మీ దగ్గర మంచి జరీ వర్క్ ఉన్న సిల్క్, పట్టు చీరలు ఉంటే దానితో దుపట్టాలు తయారుచేసి ఉపయోగించండి. బయట ఇలాంటి దుప్పటాలను కొనాలంటే 1000 కి పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి రూపాయి ఖర్చు చేయకుండా మీ పాత చీరతోనే అందమైన దుప్పటాను తయారుచేయండి. ఇందుకోసం మీకు కావాల్సినంత పొడవు సారీని కట్ చేయండి. అలాగే చివర్లను నీట్ గా కుట్టండి. దుప్పటాను ఎలివేట్ చేయడానికి థ్రెడ్ టాసెల్ లను వేయండి. లుక్ బాగుంటుంది.

45
పాత చీరలను ఇంటి అలంకరణగా ఎలా ఉపయోగించాలి?

దిండు కవర్లు

ఎవ్వరైనా సరే దిండు కవర్లను ఖచ్చితంగా వాడాల్సిందే. చాలా మంది దిండు కవర్లను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ నుంచి కొంటుంటారు. కానీ మీరే అందమైన దిండుకవర్లను రూపాయి ఖర్చు లేకుండా తయారుచేయొచ్చు. ఇందుకోసం మీ పాత చీరలనే ఉపయోగించండి. మీ పాత చీరలతో రంగురంగుల దిండుకవర్లను తయారుచేయొచ్చు. ఇందుకోసం దిండుకవర్లను తయారుచేయడానికి అవసరమైన సారీని కట్ చేసి కుట్టండి. దిండును తొడిగించి వాడండి. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి.

కర్టెన్లు

ఇంటి గోడలకు కర్టెన్లతోనే అందం వస్తుంది. అందుకే ఆడవారు మంచి మంచి కర్టెన్లను కొనేసి వాడుతుంటారు. వీటికోసం చాలా మంది ఎంతో ఖర్చుచేస్తుంటారు. కానీ మీ పాత చీరలతో కూడా అందమైన కర్టెన్లను తయారుచేసి వాడొచ్చు తెలుసా? ఇందుకోసం లుక్ బాగుండే పాత చీరను తీసుకుని అవసమైన క్లాత్ ను కట్ చేసి కర్టెన్లను కుడితే సరిపోతుంది.

55
టేబుల్ కవర్

మీరు ఎప్పుడూ వాడే టేబుల్ కవర్ బోరింగ్ గా అనిపిస్తే వెంటనే వాటి ప్లేస్ లో మీ పాత చీరలతో అందమైన టేబుల్ కవర్లను తయారుచేయండి. ఇవి మీ డైనింగ్ రూం ని అందంగా తయారుచేస్తాయి. ఇందుకోసం టేబుల్ పొడవును బట్టి చీర ను కట్ చేసుకోని అంచులను నీట్ గా కుట్టండి. అంతే టేబుల్ కవర్ రెడీ అయినట్టే. అయితే ఈ కవర్ మరింత అందంగా కనిపించాలనుకుంటే మీరు కాంట్రాస్ట్ కలర్స్ ను వాడొచ్చు. దీన్ని ఫెస్టివల్ లో వాడొచ్చు.

బెడ్ కవర్

బెడ్ కవర్ కు కూడా మీరు మీ పాత చీరలను ఉపయోగించొచ్చు తెలుసా? ఇందుకోసం సాఫ్ట్ క్లాత్ సారీని తిటసుకుని బెడ్ కవర్ గా కుట్టండి. అలాగేరెండు మూడు చీరలను కట్ చేసి రంగురంగుల బెడ్ కవర్ ను తయారుచేయొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories