చేతులకున్న మెహందీ పోవాలంటే ఇలా చేయండి

Published : Sep 06, 2025, 11:08 AM IST

చేతులకు గోరింటాకు ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఇది చేతులకు అంత సులువుగా పోదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో దీన్ని పోగొట్టొచ్చు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
16
మెహందీ

పండుగలు, పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఖచ్చితంగా ఆడవాళ్లు చేతుల నిండా మెహందీని పెట్టుకుంటారు. అయితే ఈ మెహందీ వారం రెండు వారాలు కూడా చేతులకు పోకుండా ఉంటుంది. కానీ వెలసిపోతుంది. అందుకే ఈ మెహందీ పోతే బాగుండని అనుకుంటారు. అయితే చేతులకున్న మెహందీ దానంతట అదే పోతుంది. మనం ఏం చేసినా పోదని అనుకుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో దీన్ని ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

26
బేకింగ్ సోడా

బేకింగ్ సోడా దుస్తులకున్న మరకలను మాత్రమే కాదు.. చేతులకున్న మెహందీని కూడా పోగొట్టగలదు. ఇందుకోసం చేతులను నీట్ గా కడిగి టీ స్పూన్ బేకింగ్ సోడను తీసుకుని చేతులకు రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతులను కడగాలి.. తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది చేతులు డ్రై అవ్వకుండా చేస్తుంది. 

36
టమాటా రసం

టమాటా రసంతో కూడా మనం చేతులకున్న మెహందీని పోగొట్టొచ్చు. ఇందుకోసం టమాటా రసాన్ని చేతులకు అప్లై చేసి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయండి. ఇది ఈజీగా మెహందీని పోగొడుతుంది.

46
కొబ్బరి నూనె

కొబ్బరి నూనె మన జుట్టుకు, చర్మానికి మంచి మేలు చేస్తుంది. అయితే కొబ్బరి నూనెను, చక్కెరను ఉపయోగించి చేతులకున్న మెహందీని సులువుగా పోగొట్టొచ్చు. షుగర్ మంచి ఎక్స్ఫోలియేటర్ కూడా.  కాబ్కొటి ఈ రెండింటిని మిక్బ్బస్రి చేసి చేతులకు అప్లై చేసి రుద్దాలి. కొద్ది సేపటి తర్వాత కడిగేస్తే మెహందీ లేకుండా పోతుంది. 

56
నిమ్మరసం

నిమ్మరసం మెహందీ మరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా చేతులకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. అయితే మీరు ఈ నిమ్మరసంలో బేకింగ్ సోడాను కలిపి కూడా చేతులకు రుద్దుకోవచ్చు. బేకింగ్ సోడా కలిపితే వేడినీళ్లతో చేతులను కడుక్కోవాలి. ఆ తర్వాత మర్చిపోకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 

66
ఉప్పు

ఉప్పు మంచి ఎక్స్‌ఫోలియేటర్.  కాబట్టి ఇది గోరింటానుకు పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని వేడి నీళ్లలో 5 చెంచాల ఉప్పును వేసి కలిపి చేతులను ఆ నీల్లలో 20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత తుడుచుకోండి. అంతే మెహందీ పూర్తిగాపోతుంది. అయితే తర్వాత చేతులు డ్రై అవ్వకుండా ఉండటాదనికి మీరు నూనె లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories