ముఖం మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉండటం చాలా కామన్. కానీ ఇవి అస్సలు పోవు. ఇదే ముఖ అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఈ మచ్చలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముఖం మీద ఏ మచ్చ ఉన్నా మొత్తం లుక్ పోతుంది. అయితే చాలా మందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ చాలా కామనే అయినా వీటివల్ల స్కిన్ నొప్పి పెడుతుంది. అలాగే మచ్చలు అస్సలు పోవు. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఇవి అంత సులువుగా అయితే పోవు. మరి వీటిని పోగొట్టేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
వైట్ హెడ్స్ ఎందుకు వస్తాయి?
ఈ వైట్ హెడ్స్ చిన్న చిన్న మొటిమల్లా ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్, నూనె వల్ల ఏర్పడతాయి. ఇవి చర్మ రంధ్రాలను పూర్తిగా మూసేయడం వల్ల ఏర్పడతాయి. ఇది ముఖంపై వైట్ లేదా లేత రంగులో చిన్న చిన్న మొటిమల్లా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ముక్కు, పెదవులు, నుదిటి మీద కనిపిస్తాయి.
36
బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయి?
చర్మ రంధ్రాలు మూసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ వస్తాయి. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మధ్య ఒకే ఒక్క తేడా ఉంటుంది. అదే చర్మ రంధ్రాలు తెరుచుకుని ఉండటం. బ్లాక్ హెడ్స్ నూనె, దుమ్ము, ధూళి , గాలి చర్మ రంధ్రాల్లోకి చేరి నల్లగా అవుతుంది. వీటినే మనం బ్లాక్ హెడ్స్ అంటాం. ఇవి ఎక్కువగా పెదవుల కింద, ముక్కు మీద అవుతాయి.
వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కు ప్రధాన కారణం ఆయిలీ స్కిన్ అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే నూనె డెడ్ స్కిన్ తో కలిసి చర్మ రంధ్రాలను మూసేస్తుంది. అప్పుడే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి. అలాగే శరీరంలో హార్మోన్లు అసమతుల్యంగా మారడం, ముఖ చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.
56
ఎలా తగ్గించాలి?
ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తగ్గడానికి కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి ముఖ్యంగా బేకింగ్ సోడా, నిమ్మరసంతో దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా రోజుకు రెండు సార్లుచేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే కలబంద జెల్ ను ముఖానికి రాసినా కూడా మొటిమలు తగ్గుతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నుంచి ఉపశమనం పొందుతారు.
66
తేడా ఏంటంటే?
ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వల్ల చర్మంపై మంట కలగదు. ఈ రెండూ నాన్ ఇన్ఫ్లమేటరీ పింపుల్స్. బ్లాక్ హెడ్స్ కంటే వైట్ హెడ్స్ ను తొందరగా గుర్తించలేం. ఇవి చిన్న చిన్న మొటిమల్లా అయ్యి తర్వాత పెద్దగా అవుతాయి. అదే బ్లాక్ హెడ్స్ నల్లగా ఉంటాయి కాబట్టి వీటిని సులువుగా గుర్తించొచ్చు.