గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది
woman-life Sep 06 2025
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
గ్యాస్ స్టవ్
మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతోనే గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image credits: Getty
Telugu
నిమ్మకాయ
నిమ్మకాయతో కూడా గ్యాస్ స్టవ్ ను క్లీన్ చేయొచ్చు. ఇది ఎలాంటి మరకనైనా ఇట్టే పోగొడుతుంది. ఇందుకోసం నిమ్మరసంలో డిష్ వాష్ ను వేసి తుడవాలి.
Image credits: Getty
Telugu
వెనెగర్
వెనిగర్ గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొంచెం వెనిగర్ ను గ్యాస్ స్టవ్ పై చల్లి కొద్దిసేపటి తర్వాత తుడిస్తే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
డిష్ వాష్ లిక్విడ్
గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయడానికి మీరు డిష్ వాష్ లిక్విడ్ ను కూడా వాడొచ్చు. దీన్ని స్పాంజ్ కు రాసి గ్యాస్ స్టవ్ కు బాగా రుద్ది కడగండి. స్టవ్ కు పట్టిన మురికి మొత్తం పోతుంది.
Image credits: Getty
Telugu
ఉల్లిపాయ
ఉల్లిపాయతో కూడా మీరు గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఉల్లిపాయను కొన్ని నీళ్లలో మరిగించి చల్లారిన తర్వాత స్పాంజ్ తో రుద్ది క్లీన్ చేయండి.
Image credits: Getty
Telugu
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాతో కూడా మీరు మురికిగా మారిన గ్యాస్ స్టవ్ ను సింపుల్ గా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో వెనిగర్ వేసి పేస్ట్ చేసి స్టవ్ కు రుద్ది కొద్ది సేపటి తర్వాత తుడవండి.
Image credits: Getty
Telugu
శుభ్రంగా ఉంచండి
మీరు గ్యాస్ స్టవ్ ను ఉపయోగించిన తర్వాత ఖచ్చితంగా శుభ్రం చేయండి. ఎందుకంటే దీనిపై మరకలను ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా వదిలేస్తే.. వాటిని క్లీన్ చేయడం కష్టమవుతుంది.