నీళ్లు అవసరమే లేదు.. ఇలా కూడా ఇంటిని శుభ్రం చేయొచ్చు

First Published | Jan 7, 2025, 4:53 PM IST

నీళ్లు లేకుండా ఇంటిని శుభ్రం చేయడమేంటి? అసలు క్లీన్ అవుతుందా? అని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ కొన్ని చిట్కాలతో చలికాలంలో నీళ్లు లేకుండానే  ఇంటిని నీట్ గా చేయొచ్చు. అదెలాగంటే? 

చలికాలంలో ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ సీజన్ లో చాలా మంది ఉదయం చాలా లేట్ గా లేసి పనులు చేసుకుంటుంటారు. ఈ సీజన్ లో ఇంటి ఫ్లోర్ మరీ చల్లగా ఉంటుంది. అడుగుపెట్టాలంటేనే వణుకు పుడుతుంది.

కానీ చలికాలంలో ఇంటిని శుభ్రం చేసుకోవడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే నీళ్లు మరీ చల్లగా ఉంటాయి. నేలకూడా చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నీళ్లతో ఇంటిని తుడిస్తే మరింత చల్లగా అవుతుంది. అందుకే చాలా మంది చలికాలంలో ఇంటిని ఎక్కువగా క్లీన్ చేయరు. 

కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఇంటిని ఖచ్చితంగా తుడవాలి. ముఖ్యంగా పిల్లలున్న వారు ఖచ్చితంగా ప్రతిరోజూ ఇంటిని క్లీన్ చేస్తుండాలి. లేదంటే నేలపై క్రిములు, కీటకాలు పెరిగిపోతాయి. వీటివల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 


పొడి మాపింగ్ చిట్కాలు

ఇల్లు ముందే చల్లగా ఉంది? ఇలాంటి సమయంలో చల్లనీళ్లతో ఇంటిని క్లీన్ చేయడం అవసరమా? అని చాలా మంది అనుకుంటారు. నిజానికి నీళ్లతో తుడిస్తేనే ఇల్లు క్లీన్ అవుతుంది. కానీ నీళ్లు లేకుండా కూడా మీరు మీ  ఇంటిని నీట్ గా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇది కూడా చదవండి:ఈ క్రీం పెడితే.. మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి

పొడి మైక్రోఫైబర్:

 చలికాలంలో ఇంటి ఫ్లోర్ ను నీళ్లు లేకుండా శుభ్రం చేయడానికి ఇదొక మంచి మార్గం. దీనితో నేలపై ఉన్న దుమ్ము, ధూళి సులువుగా తొలగిపోతాయి. ఇది నేలపై ఉన్న దుమ్మునంతా శుభ్రం చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని ఉపయోగించడం వల్ల నేల శుభ్రంగా, మెరుస్తుంది. అలాగే మీరు తరచుగా ఫ్లోర్ ను క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 

వాక్యూమ్ క్లీనర్:

చలికాలంలో నీళ్లు లేకుండా ఇంటిని శుభ్రం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి నేలపై ఉన్న దుమ్ము, చిన్న చిన్న చెత్తను చాలా ఈజీగా తొలగించొచ్చు. ముఖ్యంగా  ఫ్లోర్ మ్యాట్‌ను శుభ్రం చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్లోర్ ను చాలా త్వరగా శుభ్రం చేస్తుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. 

డ్రై క్లీనింగ్ స్ప్రే: 

ప్రస్తుతం ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి చాలా మంది డ్రై క్లీనింగ్ స్ప్రేలను వాడుతున్నారు. ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. దీన్ని నేలపై తేలికగా చల్లి శుభ్రమైన గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. అంతే దీంతో ఫ్లోర్ శుభ్రంగా అవుతుంది. అందంగా మెరుస్తుంది. .

పాత కిచెన్ టవల్:

పాత కిచెన్ టవల్ ను ఉపయోగించి కూడా మీరు ఇంటి ఫ్లోర్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా  దాన్ని నీళ్లలో తేలికగా తడిపి నేలను శుభ్రం చేయాలి. ఈ పద్ధతి చాలా ఈజీ.

Latest Videos

click me!