కుక్కర్ లో వీటిని మాత్రం వండకూడదు

First Published | Jan 6, 2025, 3:08 PM IST

ప్రెష‌ర్ కుక్కర్ ను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇది గ్యాస్ ను ఆదా చేయడమే కాకుండా వంటను తొందరగా అయ్యేలా చేస్తుంది. అయితే కుక్కర్ కొన్ని ఫుడ్స్ ను మాత్రం వండకూడదు. అవేంటంటే?

pressure cooker

ఒక్కప్పుడు ప్రెష‌ర్ కుక్కర్ వాడకం చాలా తక్కువగా ఉండేది. కానీ నేడు ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. ఎందుకంటే వీటివల్ల వంట చాలా తొందరగా నిమిషాల్లోనే అయిపోతుంది. దీనివల్ల గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుంది. ఈ రెండు కారణాల వల్లే ఆడవాళ్లు చాలా వంటలను ప్రెష‌ర్ కుక్కర్ లోనే చేస్తుంటారు. ప్రెష‌ర్ కుక్కర్ ను వాడటంతో వచ్చే సమస్యలేమీ లేవు కానీ.. వీటిలో కొన్ని వంటలను మాత్రం వండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వీటిని ప్రెషర్ కుక్కర్ లో వండకూడదు

ప్రెష‌ర్ కుక్కర్ లో చేయకూడని వంటలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వీటిని కుక్కర్ లో వండితే వాటి రుచి తగ్గుతుంది. అలాగే వీటిని తిన్న మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ప్రెష‌ర్ కుక్కర్ లో ఏమేమి వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


క్రిస్పీ ఫుడ్ 

నిపుణుల ప్రకారం.. ఎప్పుడైనా సరే ప్రెష‌ర్ కుక్కర్ లో క్రిస్పీ ఫుడ్ ను అస్సలు వండకూడదు. ఎందుకంటే వీటిని చేయడానికి చాలా నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని తింటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం ప్రెష‌ర్ కుక్కర్ లో క్రిస్పీ లేదా వేయించిన ఆహారాన్ని వండితే అది ఎక్కువ నూనెను గ్రహిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ప్రెష‌ర్ కుక్కర్ లో మాత్రం క్రిస్పీ ఆహారాలను వండకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

పాల ఉత్పత్తులు 

చాలా మంది ఆడవారు ప్రెషర్ కుక్కర్ లో కూడా పాల ఉత్పత్తులతో ఖీర్ లేదా ఇతర ఆహార పదార్థాలను తయారుచేస్తుంటారు. అయితే పాల ఉత్పత్తులు ప్రెషర్ కుక్కర్ అల్యూమినియంతో ప్రతిస్పందిస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే కుక్కర్ లో పాల పదార్థాలను అస్సలు తయారుచేసి తినకూడదని అంటారు. 

Pressure Cooker

కుకీస్ & కేకులు 

ప్రెజర్ కుక్కర్ లో కూడా కేకులు, కుకీలను లేదా బిస్కెట్లను తయారుచేసుకుని తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ కుక్కర్ లో వీటిని చేసుకుని అస్సలు తినకూడదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ లో కుకీలను తయారుచేస్తే తేమ వస్తుందని చెప్తారు. దీనివల్ల అవి పర్ఫెక్ట్ గా రావు. కాబట్టి వీటిని వీటన్నింటిని ఓవెన్ లోనే చేసుకుని తినడం మంచిది. 


సీఫుడ్

ప్రెజర్ కుక్కర్ లో చాలా మంది చికెన్, మటన్, చేపలు వంటి సీఫుడ్ ను కూడా వండి తింటుంటారు. కానీ సీఫుడ్ ను కుక్కర్ లో అస్సలు వండకూడదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావాన్నిచూపుతుంది. ప్రెజర్ కుక్కర్ లో సీఫుడ్ ను వండితే అది తినడానికి పనికిరాకుండా అయిపోతుంది. అలాగే పోషకాలు కూడా తగ్గుతాయి. అందుకే వీటిని ఎప్పుడూ కూడా ప్రెషర్ కుక్కర్ లో వండకూడదు. 
 

సూప్ లేదా సాస్ 

కొంతమంది ప్రెషర్ కుక్కర్ లో కూడా సూప్ లేదా సాస్ ను తయారుచేస్తుంటారు. కానీ ఇలా కుక్కర్ లో వీటిని తయారుచేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని కుక్కర్ లో చేయడం వల్ల వాటి రుచి పాడవుతుంది. అలాగే కూరగాయలను చాలా ఉడకబెట్టాల్సి వస్తుంది. కాబట్టి వీటిని కుక్కర్ లో తయారుచేయకపోవడమే మంచిది. 
 

Latest Videos

click me!