అందమైన జుట్టు కోరుకోనివారు ఎవరూ ఉండరు. జుట్టు ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడుతుంటే.. దానికి మించిన అందం స్పెషల్ గా అవసరం లేదు. ఇలాంటి జుట్టు ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దాని కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటాం. ఇక.. తెల్ల జుట్టును కనిపించకుండా ఉండేందుకు.. కలర్ వేయడం, హెన్నా పెట్టడం లాంటివి చేస్తారు. కానీ.. ఒక ఆకులను వాడటం వల్ల… జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు… తెల్ల జుట్టును కూడా తగ్గించుకోవచ్చు. మరి.. అదేంటో తెలుసుకుందాం…
మనం సాధారణంగా తెల్ల జుట్టును కవర్ చేయడానికి ఎక్కువగా హెన్నా వాడుతూ ఉంటారు. కానీ గోరుంటాకు ఆకులకు బదులు.. మునగాకు వాడితే చాలు. ఈ ఆకులను హెన్నాలాగా పేస్టులా తలకు పెట్టవచ్చు.. దీని నుంచి వచ్చే నూనెను జుట్టుకు అప్లై చేసినా.. ఒత్తుగా పెంచుకోవచ్చు. మరి.. దేని కోసం ఈ ఆకులను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
మునగాకు జుట్టు అందానికి ఎలా ఉపయోగపడుతుంది..?
మునగాకు పొడిలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముునగాకులో విటమిన్ B6 కూడా ఉంది, ఇది మీ జుట్టును బలపరుస్తుంది.
ఇందులో ఐరన్ కూడా ఉంటుంది, ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది ఆక్సిజన్ సరిగ్గా జుట్టు కుదుళ్లకు చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.
మునగాకును జుట్టుకు ఎలా అప్లై చేయాలి..?
ముందుగా ఒక గిన్నెలో 2 నుంచి 4 చెంచాల మొరింగ పొడిని జుట్టు పొడవును బట్టి వేయాలి.
దీని తరువాత, కలబంద మొక్క నుండి ఆకులను తీసి, వాటి పై తొక్క, జెల్ తీయండి.
రెండింటినీ బాగా మిక్స్ చేసి మూలాల నుండి జుట్టు పొడవు వరకు అప్లై చేయాలి.
ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు మీద సుమారు 1 గంట పాటు ఉంచండి.
ఇప్పుడు నీళ్ళు, షాంపూ సహాయంతో మీ జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ విధంగా, మీరు ఈ రెమెడీని వారానికి కనీసం 1 నుండి 2 సార్లు ప్రయత్నించవచ్చు.
ఈ రెమెడీని నిరంతరం ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వారు కూడా సరైన సంరక్షణ పొందుతారు.
grey hair
మరి, తెల్ల జుట్టు కోసం మునగాకు ఎలా వాడాలి..?
మునగాకులో మనకు అవసరం అయ్యే చాలా పోషకాలు ఉంటాయి. మన జుట్టు తెల్లగా మారకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే మన జుట్టు తెల్లగా మారకుండా సహాయపడతాయి. దీనిలో అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. దీనిలో బయోటిన్ కూడా ఉంటుంది. ఇది.. జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి.. జుట్టు పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మాత్రమే కాదు.. జింక్, విటమిన్ ఏ , ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.
తలకు ఎలా అప్లై చేయాలంటే…
మీరు ముందుగా మునగాకులను ఎండపెట్టాలి. తర్వాత దానిని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మీరు కొబ్బరి నూనె, ఆముదం ఇలా ఏదో ఒక నూనెలో ఈ పొడిని కలిపి తలకు పట్టించాలి. లేదంటే.. ఈ ఆకులను మీరు వాడే నూనెలో మరిగించి రాసుకున్నా పర్వాలేదు. ఇలా రెగ్యులర్ గా రాయడం వల్ల తెల్ల జుట్టు సమస్య ఉండదు.
మునగాకు పొడిని మీరు పెరుగులో కలిపి తలకు అప్లై చేయాలి. ఆ తర్వాత.. అరగంటకు తలస్నానం చేసినా కూడా తెల్ల జుట్టు సమస్య ఉండదు.