ఇవి కూడా వాడొచ్చు...
కరివేపాకు , పెరుగు హెయిర్ ప్యాక్:
కరివేపాకును పెరుగుతో కలిపి పేస్ట్‌లా రుబ్బండి. ఈ హెయిర్ ప్యాక్‌ను వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలకు పోషణ అంది, తెల్ల జుట్టు నల్లగా మారడానికి హెల్ప్ చేస్తుంది.
మెంతి హెయిర్ ప్యాక్:
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, వాటిని పేస్ట్‌లా రుబ్బి, వారానికి ఒకసారి మీ తలకు అప్లై చేయండి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి పాలు , నిమ్మరసం మిశ్రమం:
కొబ్బరి పాలను కొద్దిగా నిమ్మరసంతో కలిపి, మీ జుట్టుకు పోషణ అందించడానికి, తెల్ల జుట్టు రావడం ఆలస్యం అవ్వడానికి సహాయపడుతుంది.