Hair fall: హెన్నాలో ఇవి కలిపి రాస్తే... జుట్టు రాలడం ఆగిపోతుంది.. తెల్ల జుట్టు సమస్యా ఉండదు

Published : Dec 24, 2025, 03:00 PM IST

Hair Fall: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీరు హెన్నా వాడొచ్చు. చాలా మంది కేవలం జుట్టు కలర్ మార్చుకోవడానికి మాత్రమే హెన్నా వాడుతూ ఉంటారు. కానీ, ఇది హెయిర్ కి మంచి కండిషనర్ గా పని చేస్తుంది.

PREV
13
హెన్నా హెయిర్ ప్యాక్...

చలికాలంలో చర్మ సమస్యలతో పాటు, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ సీజన్ లో జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అంతేకాదు, జుట్టు బాగా పొడిబారిపోతుంది. చుండ్రు లాంటి సమస్యలు కూడా వస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. కేవలం హెన్నాతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....

23
జుట్టు రాలడాన్ని తగ్గించే హెన్నా హెయిర్ ప్యాక్...

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీరు హెన్నా వాడొచ్చు. చాలా మంది కేవలం జుట్టు కలర్ మార్చుకోవడానికి మాత్రమే హెన్నా వాడుతూ ఉంటారు. కానీ, ఇది హెయిర్ కి మంచి కండిషనర్ గా పని చేస్తుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషణ అందిస్తుంది. జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది. అయితే... నార్మల్ గా డైరెక్ట్ గా హెన్నా అప్లై చేయకుండా.. దానిలో కొన్ని పదార్థాలను కలపడం వల్ల జుట్టును మరింత అందంగా మార్చుకోవచ్చు. అంతేకాదు, తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది.

33
హెన్నాతో అరటి పండు...

హెన్నాలో పండిన అరటి పండు కూడా కలిపి జుట్టుకు రావడం వల్ల హెయిర్ చాలా సిల్కీగా మారుతుంది. అరటి పండులో ఉంటే పొటాషియం, సహజ నూనెలు జుట్టును మృదువుగా మారుస్తాయి. దీని కోసం మీరు రాత్రిపూటే మీకు అవసరమైన పొడిని తీసుకొని నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు దాంట్లో బాగా పండిన అరటి పండు గుజ్జును కూడా కలిపి మంచిగా కలపాలి. దీనిలో కావాలంటే కొంచెం పెరుగు లేదా ఆలివ్ ఆయిల్ కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసి కనీసం గంట పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి. దీనిని రెగ్యులర్ గా జుట్టుకు వాడటం వల్ల.. మీ హెయిర్ చాలా మృదువుగా మారుతుంది.

హెన్నా తో మెంతుల హెయిర్ ప్యాక్...

చలికాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని చెక్ పెట్టడానికి మీరు హెన్నా, మెంతుల హెయిర్ ప్యాక్ వాడితే సరిపోతుంది. ఈ హెయిర్ ప్యాక్ చుండ్రు సమస్యను మాత్రమే కాదు.. ఇన్ఫెక్షన్ల సమస్యను కూడా తగ్గిస్తుంది. దీని కోసం.. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను ఒక రాత్రంతా నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు ఈ మెంతులను మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే హెన్నా పొడి కలిపి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి... గంట తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.

హెన్నాతో ఆమ్లా పొడి....

జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి, ఒత్తైన జుట్టు పెంచుకోవడానికి మీరు హెన్నా, ఉసిరి హెయిర్ ప్యాక్ వాడితే సరిపోతుంది. దీని కోసం మీరు మూడు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి తీసుకోవాలి. ఈ రెండింటికీ ఒక గుడ్డు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. దీనిని మందపాటి పేస్టులాగా చేసుకొని తల,జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories