Face Glow: మందారపూలను జుట్టుకు కాదు, ఫేస్ కి ఇలా వాడితే.. మీ ముఖం మెరిసిపోవడం పక్కా..!

Published : Jul 14, 2025, 12:27 PM ISTUpdated : Jul 14, 2025, 12:31 PM IST

మందరాపూలతో తయారు చేసిన క్రీమ్ ని రోజూ ముఖానికి రాసుకుంటే.. మీ ముఖం యవ్వనంగా మెరిసిపోతుంది.

PREV
15
మందారంతో మెరిసే చర్మం..

మందారపూలు దాదాపు అందరికీ చాలా సులభంగానే దొరుకుతాయి. అయితే.. ఈ పూలను చాలా మంది జుట్టు సంరక్షణలో భాగంగా రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు. కానీ, ఈ మందారపూలు మన ముఖాన్ని కూడా అందంగా మార్చడంలోనూ చాలా బాగా సహాయపడతాయి. ఈ మందారాలను ఉపయోగించి ఇంట్లోనే ఒక క్రీమ్ తయారు చేసుకుంటే చాలు. దీనిని రోజూ వాడితే.. ముఖంలో గ్లో పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమల సమస్య ఉండదు. మొటిమల కారణంగా వచ్చే నల్ల మచ్చలు కూడా ఈజీగా తొలగిపోతాయి. మరి, ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా...

25
మందార క్రీమ్ ఎలా తయారు చేయాలి?

ఈ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఎర్ర మందారపూలు 10, రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఒక టీ స్పూన్ గ్లిజరిన్, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్

ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలంటే...

10 మందారపూల నుంచి రేకులు తీయాలి. వాటిని శుభ్రంగా నీటితో కడగాలి. తర్వాత వాటికి ఒక గ్లాసు నీటిని జోడించి.. స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరుగుతుంటే.. గులాబీ రంగు చిక్కటి జెల్ ఒకటి తయారౌతుంది. దీనిని మరో గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ రెండింటిని వేసి బాగా కలపాలి. దీనికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కూడా కలిపితే సరిపోతుంది. అంతే.. మన క్రీమ్ రెడీ అయినట్లే. దీనిని ఒక గాజు కంటైనర్ లో ఉంచి.. ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.

35
ఎలా ఉపయోగించాలి

ప్రతి రాత్రి పడుకునే ముందు మీ ముఖం నీటితో శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఈ క్రీమ్ ని రాసుకుంటే సరిపోతుంది. ఉదయం లేచిన తర్వాత మళ్లీ నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ జెల్ ని కావాలంటే చేతులు, మెడకు కూడా రాసుకోవచ్చు. కనీసం స్నానానికి అరగంట ముందు కూడా ఈ క్రీమ్ ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గా రాయడం వల్ల మీ ముఖం చాలా అందంగా మారుతుంది.

45
విటమిన్ ఈ క్యాప్సిల్ ప్రయోజనాలు..

విటమిన్ E క్యాప్సూల్ ముఖ కాంతిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ విటమిన్-E క్యాప్సూల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మాన్ని అందంగా మారుస్తాయి. రెగ్యులర్ వాడితే.. మీ ముఖం మృదువుగా మారుతుంది. ప్రకాశవంతంగా కూడా చేస్తుంది. దీనితో పాటు, దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. విటమిన్ E క్యాప్సూల్ చర్మపు మచ్చలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మొటిమలు, బ్లాక్‌హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో సహాయపడుతుంది. ముఖం పై పేరుకుపోయిన ట్యాన్ కూడా ఈజీగా తొలగించడంలోనూ సమర్థవంతంగా పని చేస్తుంది.

చర్మానికి మందార పువ్వు ప్రయోజనాలు

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, తాజా మందార పువ్వులను లేదా దాని పొడిని ఫేస్ మాస్క్‌లలో ఉపయోగించవచ్చు. ఇందులో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన గులాబీ రంగును కూడా ఇస్తుంది. దీనితో పాటు, ఇది యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి మీ చర్మాన్ని మొటిమలు వంటి సమస్యల నుండి రక్షిస్తాయి.

ఇది మీ ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. మందార పువ్వులోని యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి చాలా మంచివి. అవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. UV కిరణాల నుండి రక్షిస్తాయి.

55
చర్మానికి గ్లిజరిన్ ప్రయోజనాలు..

గ్లిజరిన్ వాడకం చర్మం పొడిబారడాన్ని తొలగించడంలో , తేమను లాక్ చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచడానికి చాలా మంది మాయిశ్చరైజర్‌ను పదేపదే అప్లై చేస్తారు, కొన్నిసార్లు దాని ప్రభావం ఎక్కువ కాలం కనిపించదు. అలాంటివారు.. చర్మాన్ని తేమగా ఉంచడానికి గ్లిజరిన్ ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా,మృదువుగా ఉంటుంది.

ఇక.. మందరాపూలు, విటమిన్ ఈ, గ్లిజరిన్.. మూడుకలిపి తయారుచేసిన క్రీమ్ రాయడం వల్ల మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories