Skin Care: 40 ఏళ్లలోనూ 20లా కనిపించాలంటే.. ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు!

Published : Jul 13, 2025, 07:32 PM IST

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖ కాంతి తగ్గుతుంది. ముడతలు కూడా వస్తాయి. వాటిని కవర్ చేసేందుకు చాలామంది రకరకాల ప్రోడక్టులు వాడుతుంటారు. అయితే సహజమైన కాంతి, యవ్వనంగా కనిపించే చర్మం కోసం బీట్రూట్‌ ఫేస్ ప్యాక్ లు చక్కగా ఉపయోగపడతాయట. ఎలాగో చూద్దాం.  

PREV
18
చర్మ సంరక్షణ చిట్కాలు

40 ఏళ్లు దాటిన తర్వాత బీట్రూట్ ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది. బీట్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.

28
బీట్రూట్, పెరుగు ఫేస్ ప్యాక్

చర్మం బిగుతుగా ఉండటానికి పెరుగు, బీట్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. 2 స్పూన్ల బీట్రూట్ రసంలో 1 స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలను తగ్గిస్తుంది. 

38
బేసన్, బీట్రూట్ ఫేస్ ప్యాక్

1 స్పూన్ బేసన్‌లో బీట్రూట్ రసం కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఫ్రెష్ గా కనిపిస్తుంది. 

48
అలోవెరా జెల్, బీట్రూట్ రసం..

కాంతివంతమైన చర్మం కోసం.. ఒక స్పూన్ బీట్రూట్ రసంలో 1 స్పూన్ అలోవెరా జెల్ కలపాలి. రెండు రోజులకోసారి ఈ ఫేస్ ప్యాక్ వాడితే సహజమైన కాంతి మీ సొంతం అవుతుంది.  

58
బియ్యం పిండి ఫేస్ ప్యాక్..

బీట్రూట్ రసంలో కొంచెం బియ్యం పిండి కలిపి.. ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడగేయాలి. దీనివల్ల ముఖం లోపలినుంచి శుభ్రం అవుతుంది.

68
తేనె, బీట్రూట్ రసం..

బీట్రూట్ రసం, తేనె సమానంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ తో చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.

78
ముల్తానీ మట్టి, బీట్రూట్ రసం

1 స్పూన్ ముల్తానీ మట్టిలో బీట్రూట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మంపై అదనపు నూనె తొలగిపోతుంది. చర్మం బిగుతుగా మారుతుంది. 

88
నిమ్మరసం, బీట్రూట్ రసం..

1 స్పూన్ నిమ్మరసంలో 1 స్పూన్ బీట్రూట్ రసం కలపాలి. దాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంత సమయం తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ తో నల్ల మచ్చలు తగ్గుతాయి. దీన్ని వారానికి రెండు సార్లు వాడచ్చు. అయితే ఏ ఫేస్ ప్యాక్ అయినా వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories