రాత్రిపూట నెయ్యిని ఇలా పెడితే మీ ముఖం మెరిసిపోతుంది

Published : Sep 03, 2025, 11:46 AM IST

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని రాత్రిపడుకునే ముందు ముఖానికి రాసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. 

PREV
15
ముఖానికి నెయ్యి ప్రయోజనాలు

మన శరీరానికి నెయ్యి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ నెయ్యి మన చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. నెయ్యిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 

 అయితే ఈ నెయ్యిని మన ముఖానికి రాసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీన్ని పడుకునే ముందు ముఖానికి పెట్టి రెండు నిమిషాలు మసాజ్ చేస్తే ముఖం కాంతివంతంగా అవుతుంది. 

25
పొడి చర్మం

పొడి చర్మం ఉన్నవారికి నెయ్యి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తాయి. అలాగే దీనివల్ల చర్మం తేమను ఎక్కువ సేపు నిలుపుకుంటుంది. కాబట్టి పొడి చర్మం ఉన్నవారు దీన్ని రాసుకుంటే మంచిది. ఇందుకోసం వీరు ప్రతిరోజూ పడుకునే ముందు కొన్ని చుక్కల నెయ్యిని ముఖానికి రాసి కాసేపు మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే ముఖాన్ని కడుక్కుంటే చర్మం సాఫ్ట్ గా అవుతుంది. 

35
కాంతివంతం

రెగ్యులర్ గా రాత్రిపడుకునే ముందు నెయ్యిని ముఖానికి పెట్టి కాసేపు మసాజ్ చేస్తే ఉదయానికల్లా చర్మం సహజంగా మెరిసిపోతుంది. నెయ్యిలో ఉండే రకరకాల విటమిన్లు మన చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. దీంతో చర్మం డల్ నెస్ పోయి బ్రైట్ గా అవుతుంది. 

45
నల్ల మచ్చలు, మొటిమల మచ్చలు మాయం

నల్ల మచ్చలు, మొటిమల వల్ల అయిన మచ్చలు పోవడానికి ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నెయ్యి ఈ మచ్చలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, అలెర్జీ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి నల్ల మచ్చలను, మొటిమల వల్ల అయిన మచ్చలను పోగొడుతాయి. 

55
యువ్వనంగా ఉండటానికి

రోజూ పడుకునే ముందు కొన్ని చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. దీనివల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి. అలాగే నెయ్యిలో యాంటీ ఆక్సెడెంట్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. 

గమనిక : అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా వాడకూడదు. వాడితే మొటిమలు వస్తాయి. నెయ్యిని అప్లై చేసిన అరగంట తర్వాత వెంటనే కడిగేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories