నడుము నొప్పికి ఈ పండ్లే మందు..!

Published : Jan 27, 2025, 05:25 PM IST

గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల నడుము నొప్పి రావడం చాలా సాధారణం అయ్యింది.  కానీ.. కొన్ని పండ్లు తినడం వల్ల  ఆ నొప్పిని చాలా ఈజీగా తగ్గించవచ్చు. మరి, అవేంటో తెలుసుకుందాం..  

PREV
17
నడుము నొప్పికి ఈ పండ్లే మందు..!
Fruits to Reduce Back Pain Naturally

ఈ రోజుల్లో నడుము నొప్పితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. దాదాపు అందరికీ కూర్చొని చేసే పనులే అయ్యాయి. ఇక రోజుల్లో గంటల కొద్దీ కుర్చీలో కూర్చొని పని చేయడం వల్ల.. ఈ నడుము నొప్పి మరింత ఎక్కువ అవుతోంది. కానీ.. మనం కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ నొప్పిని  తగ్గించుకోవచ్చు. అది కూడా పండ్లతో నొప్పిని తగ్గించవచ్చట. మరి, అవేంటో తెలుసుకుందామా...

 

 

27
బెర్రీ పండ్లు

నడుము నొప్పి వస్తే దాదాపు అందరూ ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు. కానీ,  ట్యాబ్లెట్స్ తో పని లేకుండా కొన్ని రకాల పండ్లను మీ డైట్ లో భాగం చేసుకోవాలి. అందులో బెర్రీ పండ్లు ముందు వరసలో ఉంటాయి. బెర్రీ పండ్లు.. నడుము నొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి. 

 

37
అరటిపండు

అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం లభిస్తాయి. 100 గ్రాముల అరటిపండులో 27 మి.గ్రా. మెగ్నీషియం ఉండి, నొప్పిని తగ్గిస్తుంది. మీరు ప్రతిరోజూ ఒక అరటి పండు తిన్నా.. మీ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

47
స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి మంచిది. కండరాలను బలపరుస్తుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల నొప్పి తగ్గుతుంది. మీరు  రెగ్యులర్ గా  స్ట్రాబెర్రీలు తినడం వల్ల..  కేవలం నడుము నొప్పి తగ్గడం మాత్రమే కాదు.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

57
పైనాపిల్

రెగ్యులర్ గా పైనాపిల్  తింటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాల పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. పైనాపిల్  తినడం వల్ల నొప్పి తగ్గుతుంది.

67
వీటికి దూరంగా ఉండండి

ఎర్ర మాంసం, వేపుళ్ళు, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పానీయాల వల్ల బెన్ను నొప్పి వస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

77
గమనించండి

ఈ సమాచారం ప్రాథమికమైనది మాత్రమే. మరిన్ని వివరాలకు వైద్యులను సంప్రదించడం మంచిది. వైద్యుల సలహా మేరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
 

Read more Photos on
click me!

Recommended Stories