విటమిన్ సితో కలపండి
విటమిన్ సి కి బెస్ట్ సోర్స్ నారింజ రసం. కాబట్టి, నారింజ రసంతో విటమిన్ ఇ నూనెను కలిపి మీ ముఖంపై పూయండి. మీ ముఖం మీద దాదాపు 15 నిమిషాలు అలాగే ఉంచండి . ఆ తర్వాత, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. అంతే.. మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది. చాలా తేజస్సు కనపడుతుంది.
మాయిశ్చరైజర్ కాంబినేషన్ లో..
చాలా మంది విటమిన్ E ని నేరుగా ముఖానికి పూసుకున్నప్పటికీ, మీరు దానిని మీ రోజువారీ మాయిశ్చరైజర్‌తో కూడా కలపవచ్చు. ఈ విధంగా మీ ముఖానికి విటమిన్ E ని పూయడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి. మీరు దీన్ని సాధారణ క్రీమ్ లాగా మీ ముఖానికి అప్లై చేయవచ్చు.