అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఇవి మీ ముఖం నీరసంగా, అలసటగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నవారు ఎంత మేకప్ వేసుకున్నా వేస్టే. అందుకే ఇవి తగ్గడానికి చాలా మంది రకరకాల క్రీములను, చిట్కాలను ఫాలో అవుతుంటారు.
అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను మీరు నేచురల్ గా తగ్గించుకోవాలంటే కుంకుమ పువ్వు బెస్ట్ అంటారు నిపుణులు. అవును కుంకుమపువ్వును మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకుంటే మీరెన్నో ప్రయోజనాలను పొందుతారు.
కుంకుమ పువ్వు కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.