Rashmika: రష్మికకు ఫిట్ గా ఉండటం అంటే... కెమేరా ముందు అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది శక్తివంతంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిలపడటం, తన శరీరాన్ని గౌరవించడం.
నేషనల్ క్రష్ రష్మికను స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరస సినిమాలతో దూసుకువెళ్తోంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ అనే ఉమెన్ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రష్మిక గ్యాప్ లేకుండా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. అసలు రష్మిక... తన ఫిట్‌నెస్ కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుంది..? తాను తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
24
రష్మిక దృష్టిలో ఫిట్‌నెస్ అంటే ఏంటి?
రష్మికకు ఫిట్ గా ఉండటం అంటే... కెమేరా ముందు అందంగా కనిపించడం మాత్రమే కాదు, అది శక్తివంతంగా ఉండటం, ఆత్మ విశ్వాసంతో నిలపడటం, తన శరీరాన్ని గౌరవించడం. ఆమెకు ఫిట్నెస్ అనేది మానసికంగానూ, శారీరకంగానూ రెండింటీ బ్యాలెన్స్ చేయడం. దీనినే ఆమె ఫాలో అవుతూ ఉంటారు.
34
రష్మిక ఫిట్‌నెస్ షెడ్యూల్..
రష్మిక ప్రతి వారం కనీసం నాలుగు రోజులు వర్కౌట్ చేస్తారు. ముఖ్యంగా శక్తిని పెంచుకోవడానికి కిక్ బాక్సింగ్, కార్డియో చేస్తూ ఉంటారు. యోగా,స్ట్రెచింగ్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కండరాలను బలపరుచుకోవడానికి వెయిట్ ట్రైనింగ్ , ఆనందంగా ఫిట్ గా ఉండటానికి వెయిట్ ట్రైనింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆమె 100 కిలోల డెడ్‌లిఫ్ట్ పూర్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆమె క్రమశిక్షణకు నిదర్శనం. ఈ మిక్స్‌డ్ వర్క్‌అవుట్ వల్ల ఆమె శరీరం బలంగా ఉండడమే కాకుండా, శక్తి, స్థిరత్వం, ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతాయి.
ఫిట్నెస్ లో ఆహారం కూడా ఒక భాగం. రష్మిక ప్రతిరోజూ ఉదయం ఒక పెద్ద గ్లాస్ నీరు లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతూ తన రోజును మొదలుపెడతారు. ఆమె ఆహారం ఎక్కువగా శాకాహారం లేదా ఎగ్జిటేరియన్ అంటే అవసరమైతే మాత్రమే గుడ్లు తింటుంది. ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తేలికపాటి సూప్ లేదా, స్మూతీలు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో రైస్ తక్కువగా ఉన్న దక్షిణ భారత శైలీ ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట సూప్ లేదా పండ్లు తీసుకుంటూ ఉంటారు. స్నాక్స్ కోసం చిలకడదుంపలు, నట్స్, సీడ్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. శరీరాన్ని చాలా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.