ముఖం తెల్లగా మారడం...
మీ స్కిన్ సాధారణం కంటే ఎక్కువ పాలిపోయినట్లు గా మారింది అంటే రక్త హీనతకు కారణం కావచ్చు. ఇది తరచుగా థైరాయిడ్ లేదా ఇతర హార్మోన్ల సమస్యలతో ముడిపడి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ సరిగా పని చేయకపోవడం వల్ల శరీర రక్త ప్రసరణ, ఎర్ర కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది చర్మ రంగును పాలిపోవడానికి దారితీస్తుంది. కార్టిసాల్ అనే హార్మోన్ రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
పొడిబారిన, నిర్జీవమైన చర్మం...
మీ చర్మం అకస్మాత్తుగా చాలా పొడిగా, దురదగా , నిర్జీవంగా మారితే, అది థైరాయిడ్ హార్మోన్ లోపం, ముఖ్యంగా థైరాక్సిన్ సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్లు చర్మం తేమ , సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లు తగ్గినప్పుడు, చర్మం దాని సహజ తేమ, మెరుపును కోల్పోతుంది. అదనంగా, ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల చర్మంలో కొల్లాజెన్ తగ్గుతుంది.