మీరు మోడ్రన్ గా, స్లిమ్ గా కనిపించాలంటే మీరు వేసుకున్న దుస్తులు శరీరానికి అంటుకోకూడదు. ఇందుకోసం కాటన్, సిల్క్, షిఫాన్, జార్జెట్ వంటి దుస్తులను ధరించండి. ఇవి మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. అదే మందంగా, శరీరానికి అంటుకుని ఉన్నదుస్తులను వేసుకుంటే మీరు లావుగా కనిపిస్తారు. అలాగే మీ సైజుకు సరిగ్గా సరిపోయే వాటినే ధరించాలి. చాలా టైట్ గా లేదా వదులుగా ఉన్నవి మిమ్మల్ని సన్నగా చూపించవు.