జుట్టుకే కాదు ముఖానికి కూడా కొబ్బరి నూనె పెట్టొచ్చు.. దీనివల్ల ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయ్..

Published : Aug 26, 2025, 10:47 AM IST

చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెనే వాడుతారు. ఎందుకంటే ఇది మన జుట్టును బలంగా చేసి జుట్టు రాలిపోకుండా చేస్తుంది. అయితే ఈ నూనెను ఒక్క జుట్టుకే కాకుండా.. ముఖానికి కూడా పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? 

PREV
15
కొబ్బరి నూనె ప్రయోజనాలు

కొబ్బరి నూనెలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్, చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. అందుకే మార్కెట్ లోకి ఎన్ని రకాల నూనెలు వచ్చినా కొబ్బరి నూనెనే పెడుతుంటారు. అయితే ఈ కొబ్బరి నూనె ఒక్క జుట్టుకు మాత్రమే కాదు మన ముఖానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనెను ముఖానికి పెట్టడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

25
కొబ్బరి నూనె ప్రయోజనాలు

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఈ సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. అది కూడా కొబ్బరి నూనెతో.

35
కొబ్బరి నూనెను ముఖానికి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

చర్మానికి రక్షణ

ముఖానికి కొబ్బరి నూనెను పెట్టడం వల్ల చర్మంపై ఉండే హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, కాఫ్రిక్ యాసిడ్, కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి అంటువ్యాధులకు దారితీసే బ్యాక్టీరియా, శిలింధ్రాలను చంపేస్తాయి. దీంతో మొటిమలు ఏర్పడవు.

చర్మంలో తేమ

పొడి చర్మంతో బాధపడేవారికి కొబ్బరి నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మంచి మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖానికి కొబ్బరి నూనెను పెడితే చర్మం తేమగా ఉంటుంది. కాబట్టి డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

45
మొటిమలు తగ్గుతాయి

మొటిమలను తగ్గించుకునేందుకు చాలా మంది ఖరీదైన క్రీం లను పెడుతుంటారు. కానీ వీటిని రూపాయి ఖర్చులేకుండా జస్ట్ కొబ్బరి నూనెతోనే తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఉన్న శోథ నిరోధక లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, కాప్రిక్ యాసిడ్ లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియను చంపుతాయని నిపుణులు చెబుతున్నారు.

మంట తగ్గుతుంది

కొబ్బరి నూనె మంటను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి.

కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మంట, ఎరుపు, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు ముఖాన్ని వడదెబ్బ నుంచి కూడా కాపాడుతుంది.

55
వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది

కొబ్బరి నూనెను ముఖానికి పెట్టడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు, గీతలు తగ్గిపోతాయి. అలాగే చర్మం సాఫ్ట్ గా అవుతుంది. కొబ్బరినూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడిక్స్ నుంచి చర్మాన్ని రక్షించి చర్మ ఆకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి

కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తామర, మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లు తగుతాయి. అలాగే కొబ్బరి నూనె ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories