ముఖ సంరక్షణ సరిగ్గా లేకపోతేనే రకరకాల చర్మ సమస్యలు వస్తాయి. అయితే ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజూ పడుకునే ముందు జస్ట్ ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అలాగే ఇంటి చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు. వీటితో పాటుగా రాత్రిపూట కొన్ని చిట్కాలను పాటించినా కూడా మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ఈ చిట్కాలు మీ చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేసస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
25
రాత్రి చర్మ సంరక్షణ చిట్కాలు
నిపుణుల ప్రకారం.. మీ ముఖ చర్మ సమస్యలు తగ్గాలన్నా, మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవాలన్నా మీరు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని చర్మ సంరక్షణ దినచర్యను అనుసరిస్తే సరిపోతుంది. అది కూడా జస్ట్ ఐదు నిమిషాలే. దీనివల్ల మీ ముఖం అందంగా మారుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే?
35
ముఖానికి పచ్చి పాలను ఉపయోగించాలి
ముఖం అందంగా కనిపించాలంటే ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం పూర్తిగా ఆరిన తర్వాత పచ్చి పాలను ముఖానికి అప్లై చేయండి. లేదా కాటన్ ప్యాడ్ తో మీరు పాలను ముఖానికి పెట్టొచ్చు.
45
డార్క్ సర్కిల్స్ ను ఇలా తగ్గించండి
చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఎన్నో కారణాల వల్ల వచ్చినా వీటి వల్ల ముఖ అందం తగ్గుతుంది. అయితే మీరు ఈ డార్క్ సర్కిల్స్ ను ఆలుగడ్డలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక ఆలుగడ్డను తీసుకుని సన్నగా తురమండి. దీన్ని నుంచి రసాన్ని తీసి పడుకునే ముందు కళ్ల చుట్టూ అప్లై చేయండి. ఈ రసం మీ డార్క్ సర్కిల్స్ ను తగ్గించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
55
కనుబొమ్మలకు ఆలివ్ ఆయిల్ రాయండి
కనుబొమ్మలు అందంగా ఉంటే మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజూ పడుకునే ముందు కనురెప్పలకు, కనుబొమ్మలను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను రాయండి. ఈ నూనెలను పెట్టడం వల్ల కనుబొమ్మలు దట్టంగా వస్తాయి.
అయితే నూనె పెట్టేటప్పుడు కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనుబొమ్మల వల్ల మీ ముఖ అందం రెట్టింపు అవుతుంది. అయితే మీరు ఏదైనా ఉపయోగించే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ చేయాలి.