ఓట్స్ లో ఇదొక్కటి కలిపి రాస్తే... ముఖంపై ముడతలు అనేవీ రావు..!

Published : Aug 21, 2025, 10:34 AM IST

మీరు ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే కొన్ని సహజ ఉత్పత్తులు ఉపయోగించాలి. మనకు చాలా సులభంగా లభించే.. ఓట్స్ మన ముఖాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు.. ముఖంపై ముడతలు అనేవి రావు.

PREV
13
Face Glow

వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. అంతేకాదు.. చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంలో అందం తగ్గుతుంది. ఇలా ముడతలు ముఖంపై రావడం మొదలు అవ్వగానే.. చాలా మంది ఖరీదైన క్రీములు రాయడం మొదలుపెడతారు. ఈ క్రీములు రాసినంత కాలం యవ్వనంగా కనిపించినట్లే అనిపిస్తుంది. కానీ.. ఒక్కసారి ఆపేయగానే.. ముఖంలో కళ మళ్లీ తప్పుతుంది. అలా కాకుండా.. మీరు ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే కొన్ని సహజ ఉత్పత్తులు ఉపయోగించాలి. మనకు చాలా సులభంగా లభించే.. ఓట్స్ మన ముఖాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు.. ముఖంపై ముడతలు అనేవి రావు. చర్మం వదులుగా ఉండదు. బిగుతుగా మారి.. యవ్వనంగా కనిపిస్తుంది. అయితే... కేవలం ఓట్స్ మాత్రమే కాకుండా.. దానిలో ఇంకొక్కటి కలిపి రాస్తే... అందం రెట్టింపు అవుతుంది. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం...

23
కీరదోసకాయ, ఓట్స్ ఫేస్ ప్యాక్...

మీ చర్మంపై ఓట్స్, కీరదోసకాయ రెండూ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని రాయడం వల్ల మీ ముఖం యవ్వనంగా మారుతుంది. అంతేకాకుండా, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండూ కలిపి ముఖానికి పేస్టులా చేసి రాస్తే.. ముఖంపై ముడతలు అనేవి రావు. మీ వయసు పదేళ్లు తగ్గినట్లు కనపడతారు.

కీరదోసకాయ, ఓట్స్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలంటే...

ముందుగా.. కీరదోసకాయను మంచిగా తురుముకోవాలి. ఈ తరుముకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి బాగా కలపాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత ముఖానికి మంచిగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు.. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసినా.. మీ ముఖం యవ్వనంగా కనపడుతుంది. ముఖ్యంగా ముడతలు అనేవే ఉండవు.

33
అరటి పండు పెరుగు ఫేస్ ప్యాక్...

అరటి పండును పెరుగులో కలిపి మెత్తని పేస్టులాగా తయారు చేసుకోవాలి. దీనిని మీ ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీనిని రెగ్యులర్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల.. మీ చర్మం చాలా బిగుతుగా, యవ్వనంగా మారుతుంది. అరటి పండు చర్మానికి మంచి పోషణ ఇస్తుంది. ఇక పెరుగు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడుతుంది.

ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే, మీ ముఖంపై సరైన ఉత్పత్తులను ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీనితో పాటు, మీ చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. వేటినైనా ముఖానికి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం తప్పనిసరి. ఎలాంటి సమస్య లేకపోతేనే.. మీరు మీ ముఖానికి అప్లై చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories