ఇది పెడితే ముఖం మీద ఒక్క వెంట్రుక ఉండదు

Published : Aug 20, 2025, 12:44 PM IST

ముఖం మీద వెంట్రుకలను తొలగించేందుకు చాలా మంది వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఒక చిట్కా మాత్రం రూపాయి ఖర్చు లేకుండా ముఖంపై ఒక్క వెంట్రుక లేకుండా చేస్తుంది. అదేంటంటే? 

PREV
15
ముఖం మీద వెంట్రుకలు

చాలా మంది ఆడవారికి ముఖం అంతా వెంట్రుకలు ఉంటాయి. వీటిని తొలగించేందుకు మార్కెట్ లో ఖరీదైన చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది రెగ్యులర్ గా ఈ అవాంఛిత రోమాలను తొలగించుకుంటుంటారు. 

తాత్కాలికంగా వీటిని తొలగించే ప్రొడక్ట్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. నిజానికి ఇవి చాలా ఖరీదైనవి. కానీ చాలా తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. కానీ వీటివల్ల వెంటనే ప్రయోజనం పొందుతారు. 

కానీ కొన్ని రోజుల తర్వాత తిరిగి ఈ అవాంఛిత రోమాలు వస్తాయి. దీనివల్ల ముఖ అందం దెబ్బతింటుంది. అయితే రూపాయి ఖర్చు చేయకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా.. శాశ్వతంగా ఈ అవాంఛిత రోమాలను తొలగించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
ముఖంపై అవాంఛిత వెంట్రుకలను ఎలా తొలగించాలి?

చాలా మంది ఆడవారికి ముఖం మీద వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇది వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది వెక్కిరిస్తుంటారు కూడా. నిజానికి శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ పెరగడం వల్లే ఇలా ముఖం మీద అవాంఛిత రోమాలు పెరుగుతాయి.

 దీనివల్ల గడ్డం, మీసాలు వస్తాయి.అయితే పురుషుల శరీరంలోనే ఈ ఆండ్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అందుకే వారికి గడ్డం, మీసాలు నిండుగా ఉంటాయి. అదే ఈ హార్మోన్ ఆడవారి శరీరంలో పెరిగినప్పుడు ఇలా శరీరం లోపలి నుంచి వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. కానీ ఒక్క రెసిపీని ట్రై చేస్తే మాత్రం మీరు ఈ సమస్య నుంచి బయటపడతారు.

35
కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు గోధుమ పిండి, ఒక చిన్న, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఆవాల నూనె, 1/2 కప్పు నీళ్లు.

45
తయారీవిధానం

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు, గోధుమ పిండి, పసుపు, నూనె వేసి బాగా కలగలపంవడి. దీన్ని ఒక పేస్ట్ లా చేయండి. ఈ పిండిని తీసుకుని మీ ముఖానికి రుద్దండి. ప్రతిరోజూ కనీసం 5 నిమిషాల పాటు దీన్ని మీ ముఖానికి పెట్టండి.

 ఇలా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న వెంట్రుకలు సులువుగా ఊడిపోతాయి. అంటే ఈ పిండికి వెంట్రుకలు అంటుకుని వస్తాయి. కాబట్టి ఇది ట్రైచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ముఖంపై దద్దుర్లు కూడా ఏర్పడొచ్చు. ఇది మీకు నొప్పి కలిగిస్తుంది.

55
ఈ చిట్కా ఇతర ప్రయోజనాలు

ఈ చిట్కా వల్ల ముఖంమీద వెంట్రుకలు తొలగిపోవడమే కాకుంబడా.. మీ చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయంటున్నారు నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖం ట్యానింగ్ ను తొలగిస్తుంది. అలాగే ముఖం మీదున్న చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. రోజూ ఈ పిండిని ముఖానికి రుద్దడం వల్ల మీ చర్మం టైట్ గా అవుతుంది. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు. మీరు ప్రతిరోజూ పిండిని ముఖానికి పెడితే మీ చర్మపు రంగు మునపటి కంటే మెరుగుపడుతుంది. గ్లో వస్తుంది.

అయితే మీ స్కిన్ సున్నితంగా ఉంటే గనుక దీన్ని ప్రయత్నించే ముందు స్కిన్ ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. అలాగే నిపుణులను సంప్రదించిన తర్వాతే దీన్ని ప్రయత్నించాలి. ముఖ్యంగా మీకు మొటిమలు ఉంటే గనుక ఈ చిట్కాను ట్రై చేయకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories