Grey Hair: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే... తెల్ల జుట్టు మళ్లీ కనిపించదు..!

Published : May 07, 2026, 11:52 AM IST

 Grey Hair: తెల్ల జుట్టు కనిపించకుండా ఉండాలని కలర్ వేస్తున్నారా? కెమికల్స్ తో నిండిన ఈ కలర్స్ వాడే బదులు సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చకోవచ్చు. దాని కోసం కొబ్బరి నూనె వాడితే చాలు. 

PREV
13
Grey Hair

ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. తెల్ల వెంట్రుకలు కనపడుతుంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. వయసు మళ్లినవారిలా కనిపిస్తామనే బాధతో మార్కెట్లో దొరికే ఏవేవే కలర్స్ తెచ్చి జుట్టుకు పూసేస్తూ ఉంటారు.దీని వల్ల టెంపరరీగా జుట్టు నల్లబడినా..మళ్లీ కొద్ది రోజులకే తెల్ల జుట్టు రావడం మొదలౌతుంది. అంతేకాకుండా.. జుట్టుకు వేసే కలర్స్ ఉండే కెమికల్స్ కారణంగా.. జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి.. ఆ రసాయనాలు లేకుండా.. సహజంగా తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం....

23
కొబ్బరి నూనె తో తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఎలా..?

కొబ్బరి నూనె జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. కొబ్బరి నూనెను నార్మల్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి తేమ అందుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.జుట్టును పట్టుకుచ్చులా మార్చి, మృదువుగా చేస్తుంది. హెయిర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇదే కొబ్బరి నూనె వాడి తెల్ల జుట్టు సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. అయితే.. దీనిలో మరి కొన్ని సహజంగా లభించే కొన్ని పదార్థాలు కలిపి జుట్టుకు రాయాలి.

ముందుగా, పొయ్యి మీద ఒక ఇనుపు పాత్రను వేడి చేసి.. అందులో కొద్దిగా కొబ్బరి నూనె పోయాలి. ఆ తర్వాత, నువ్వుల నూనె, మెంతులు వేసి కలపాలి. ఆ తర్వాత కరివేపాకు, నల్ల జీలకర్ర, ఉసిరి పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం ముదురు రంగులోకి మారే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. తర్వాత ఈ నూనెను చల్లబరచాలి. ఆరిన తర్వాత వడకట్టి.. ఒక శుభ్రమైన గాజు పాత్రలో స్టోర్ చేయాలి. ఈ నూనెను మీరు వారానికి ఒకటికి రెండు సార్లు మీ జుట్టుకు రాసుకోవాలి. రాత్రిపూట ఈ నూనె రాస్తే.. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండుసార్లు రెండు నెలలు ఈ నూనె వాడితే.. నెమ్మదిగా మీ తెల్ల జుట్టు నల్లగా మారడం మొదలుపెడుతుంది.

33
తెల్ల జుట్టు నల్లగా ఎలా మారుతుంది?

మనం ఈ నూనెలో కరివేపాకు, ఉసిరి, మెంతులు వంటి పదార్థాలు కలుపుతున్నాం. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇనుపు పాత్రలో వీటన్నింటినీ కొబ్బరి నూనెలో మరిగిస్తున్నాం.. కాబట్టి.. మంచి క్వాంటిటీలో ఐరన్ లభిస్తుంది. ఇవన్నీ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అయితే... ఒక్కసారి వాడితే తెల్ల జుట్టు నల్లగా మారదు. రెగ్యులర్ గా వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories