అరటి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దానిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అయితే.. ఇదే అరటి పండు మన జుట్టును కూడా అందంగా మారుస్తుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే.... ఖరీదైన షాంపూలతో పని లేకుండా ఈ పండు వాడితే... జుట్టు మృదువుగా మారడంతో పాటు.. మెరుస్తూ కనపడుతుంది. అరటి పండులో సిలికా అనే ఖనిజం ఉంటుంది. ఇది మీ శరీరం కొల్లాజెన్ ను సంశ్లేషణ చేయడానికి, మీ జుట్టును బలంగా, మందంగా మార్చడానికి సహాయపడుతుంది.మరి.. దీనిని జుట్టుకు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
25
జుట్టు పెరుగుదలకు అరటి పండు హెయిర్ మాస్క్...
అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టును బలంగా మారుస్తాయి.రెగ్యులర్ గా అరటి పండు మాస్క్ ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల.. కుదుళ్లు బలంగా మారతాయి. ఈ హెయిర్ మాస్క్ వల్ల తొందరగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
చుండ్రును పోగొట్టే అరటిపండు హెయిర్ మాస్క్
శతాబ్దాలుగా.. అరటి తొక్కలు, ఆకులు, పువ్వులు , పండ్లను వివిధ సంస్కృతులలో వివిధ వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. అరటిపండులోని వివిధ భాగాల నుండి సేకరించిన యాంటీఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే.. ఈ పండు వాడి చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు..జుట్టుకు అవసరమైన తేమ లభిస్తుంది. జుట్టు పొడిబారే సమస్య కూడా ఉండదు. చుండ్రు, బ్యాక్టీరియా వంటి సమస్య పూర్తిగా పోతుంది.
35
అరటిపండు , పెరుగు హెయిర్ ప్యాక్..
అరటి పండు, పెరుగు రెండూ కలిపి జుట్టుకు అప్లూ చేయడం వల్ల.. జుట్టు అందంగా మారుతుంది. అరటిపండులోని తేమ, పెరుగులోని లాక్టిక్ ఆమ్లం జుట్టును మృదువుగా చేస్తాయి.
అరటిపండు , తేనె హెయిర్ ప్యాక్
తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అరటిపండు, తేనె హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టుకు సహజ మెరుపు లభిస్తుంది. జుట్టు అందంగా కనిపిస్తుంది.
కలబందలోని యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తాయి. అరటిపండు , కలబంద హెయిర్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా కనపడుతుంది.
అరటిపండు , కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్
కొబ్బరి నూనె జుట్టు మూలాలను లోతుగా పోషిస్తుంది. అరటిపండుతో అప్లై చేయడం వల్ల జుట్టు బలపడుతుంది. ఒత్తుగా కూడా పెరుగుతుంది.
55
అరటిపండు , గుడ్డు హెయిర్ ప్యాక్
గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. బలంగా చేస్తుంది. అరటిపండు , గుడ్డు హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు నునుపుగా, మెరిసేలా చేస్తుంది.
అరటిపండు , ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్
ఆలివ్ ఆయిల్ హెయిర్ రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందంగా మెరుస్తూ కనపడుతుంది. అరటిపండుతో కలిపి ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల జుట్టుకు సహజ మెరుపు వస్తుంది.
అరటిపండు, మెంతుల హెయిర్ ప్యాక్
మెంతులు చుండ్రు , దురదను తొలగిస్తాయి. అరటిపండు , నానబెట్టిన మెంతుల హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.