Face Glow: వర్షాకాలంలో ఈ ఒక్క క్రీమ్ రాసినా... ముఖం మెరిసిపోతుంది..!

Published : Aug 15, 2025, 10:29 AM IST

మన ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్థాలతో ముఖాన్ని మృదువుగా మార్చడమే కాదు...చర్మాన్ని మెరిసేలా కూడా చేయవచ్చు.

PREV
14
Face Glow

వర్షాకాలంలో దాదాపు చాలా మంది ముఖం డ్రైగా మారుతుంది. ఇలా డ్రై గా మారితే... ముఖంలో కళ తప్పుతుంది. ఇలా డ్రైగా లేకుండా ఉండేందుకు చాలా మంది రెగ్యులర్ గా మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటారు. అయితే.. కొన్ని మాయిశ్చరైజర్లు ముఖానికి రాసినప్పుడు బాగానే ఉంటాయి. కాసేపటి తర్వాత మళ్లీ ఫేస్ డ్రై అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. మన ఇంట్లో లభించే కొన్ని రకాల పదార్థాలతో ముఖాన్ని మృదువుగా మార్చడమే కాదు...చర్మాన్ని మెరిసేలా కూడా చేయవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

24
ముఖానికి ఏం రాయాలి?

పొడి చర్మం ఉన్నవారు తమ చర్మాన్ని హైడ్రేటెడ్ గా, మృదువుగా ఉంచుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. వంట గది సహజ చర్మ సంరక్షణ పదార్థాలతో నిండి ఉంటుంది. అలాంటి వాటిలో పాల మీగడ, పసుపు ముందు వరసలో ఉంటాయి. పాలు చాలా మంది తమ స్కిన్ కేర్ రొటీన్ లో వాడుతూనే ఉంటారు. కానీ, పాలకు బదులు.. ఆ పాలమీద మీగడ వాడితో ముఖం నునుపుగా మారడమే కాకుండా.. మంచిగా మెరిసిపోతుంది.మరి, ఈ రెండింటిని ఎలా వాడాలంటే...

ఈ వర్షాకాలంలో మీరు మెరిసే చర్మాన్ని పొందాలనుకుంటే, మిల్క్ క్రీమ్ , పసుపును ఉపయోగించి ఇంట్లోనే ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేసుకుని అప్లై చేయండి.

34
ఫేస్ క్రీమ్ తయారీకి అవసరమైన పదార్థాలు..

ఒక టేబుల్ స్పూన్ తాజా క్రీమ్(పాలమీద మీగడ)

పావు టీస్పూన్ పసుపు పొడి

అర టీస్పూన్ శెనగ పిండి

కొన్ని చుక్కల రోజ్ వాటర్

44
ఫేస్ మాస్క్ ముఖానికి ఎలా అప్లై చేయాలి?

ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని.. అందులో పాలమీద మీగడ తీసుకోవాలి. అందులోనే పసుపు కూడా చేర్చాలి. బాగా కలిపిన తర్వాత.. శనగ పిండి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా వేసి మంచి మిశ్రమంలా కలపాలి. అంతే.. ఫేస్ క్రీమ్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాయడానికి ముందు.. ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పొడిగా మారే వరకు తుడుచుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మంచిగా అప్లై చేయాలి. మీ కళ్లు , పెదాలు తప్ప.. మిగిలిన ప్రదేశం అంతా ఈ క్రీమ్ ని అప్లై చేయాలి. కనీసం 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. కొద్దిగా ఫేస్ మాస్క్ ఆరిన తర్వాత.. ముఖాన్ని కొద్దిగా నీటితో మంచిగా స్క్రబ్ చేయాలి. వృత్తాకారంలో చేతి వేళ్లతో మంచిగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ముఖం మృదువుగా.. అందంగా కనపడుతుంది. వారానికి రెండు, మూడు సార్లు అయినా.. దీనిని ప్రయత్నిస్తే.. మీ అందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా... డ్రై స్కిన్ సమస్య అనేదే ఉండదు. మృదువుగా, చర్మం తేమగా మారుతుంది. ముఖం, మెడపై పేరుకుపోయిన మురికి కూడా పోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories