Skin Care: ఈ పిండి పెడితే ముఖం మీద ఒక్క మచ్చ ఉండదు

Published : Aug 14, 2025, 05:26 PM IST

మొటిమలు, పిగ్మెంటేషన్ వల్ల ముఖంపై నల్ల మచ్చలు అవుతుంటాయి. అయితే బియ్యం పిండిని పెడితే ముఖంపై మీద ఒక్క మచ్చ కూడా ఉండదు. దీన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
Rice Flour Face Packs

ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మొటిమలు, పిగ్మెంటేషన్ వల్ల ముఖం డల్ గా అవుతుంది. ముఖ్యంగా ముఖమంతా మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టేందుకు చాలా మంది ఖరీదైన ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయినా మచ్చలు పోలేదని వాపోతుంటారు. కానీ మీరు బియ్యం పిండితో ఈ మచ్చలను సులువుగా పోగొట్టొచ్చు. బియ్యం పిండి మన చర్మానికి వరంలాంటిదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

25
బియ్యం పిండి

బియ్యం పిండిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-బి లు మెండుగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మచ్చలను పోగొట్టి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.మీ ముఖంపై మచ్చలు ఉండకూడదంటే బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ను ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

35
బియ్యం పిండి, పాల ఫేస్ ప్యాక్

బియ్యం పిండి, పాల ఫేస్ ప్యాక్ ముఖం మీదున్న మచ్చలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ ఫ్యాక్ మీ స్కిన్ మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ లోని లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను లేకుండా చేస్తుంది. అలాగే బియ్యం పిండి మన చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దీంతో మీ స్కిన్ అందంగా మెరుస్తుంది. ఇకపోతే ఈ ప్యాక్ లో ఉండే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మచ్చలు లేకుండా చేస్తాయి.

కావాల్సిన పదార్థాలు : రెండు టీస్పూన్ల బియ్యం పిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్ పచ్చిపాలు అవసరమవుతాయి.

తయారుచేసే విధానం

ముందుగా ఒక గిన్నెలోకి బియ్యంపిండిని తీసుకోండి. దీనిలో పాలను, పసుపును పోసి పేస్ట్ చేయండి. మీది డ్రై స్కిన్ అయితే దాంట్లో రోజ్ వాటర్ ను కూడా పోయొచ్చు ఈ ప్యాక్ ను ముఖానికి రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చేతులతో తేలికగా స్క్రబ్ చేస్తూ చల్ల నీళ్లతో కడిగేయండి.

45
బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్

బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్ యాంటీ ఏజింగ్, మాయిశ్చరైజింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ లోని తేనె మన చర్మాన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే మన చర్మాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. ఇకపోతే దీంట్లోని కలబంద చర్మాన్ని చల్లబరిచి, ముఖం మీదున్న ముడతలను తగ్గిస్తుంది. అలాగే పిండి స్కిన్ టోన్ ను సమం చేయడానికి సహాయపడుతుంది.

కావాల్సిన పదార్థాలు: రెండు టీ స్పూన్ల బియ్యం పిండి, టీ స్పూన్ కలబంద గుజ్జుు, టీ స్పూన్ తేనె అవసరమవుతాయి.

తయారుచేసే విధానం: బియ్యం పిండి, కలబంద, తేనె అన్నింటిని ఒకదాంట్లో వేసి బాగా కలపండి. ఈ ప్యాక్ ను ముఖంతో పాటుగా మెడకు కూడా అప్లైచేయండి. 20 నిమిషాలు ఉంచి చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

55
బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్

మొటిమలు తగ్గడానికి, జిడ్డు లేకుండా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ లో వాడే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్లాక్ హెడ్స్ ను, మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక నిమ్మరసం ఫేస్ లో అదనపు నూనెను కంట్రోల్ చేస్తుంది. బియ్యప్పిండి చర్మ రంధ్రాలను బిగిస్తుంది. స్కిన్ ను స్మూత్ గా ఉంచుతుంది.

కావాల్సిన పదార్థాలు: రెండు టీస్పూన్ల బియ్యం పిండి, ఒక టీ స్పూన్ నిమ్మరసం, టీస్పూన్ పెరుగు అవసరమవుతాయి.

తయారుచేసే విధానం: పై పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి పేస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు వదిలేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత తడి చేతులతో మసాజ్ చేసి శుభ్రమైన నీళ్లతో కడిగేయండి.

Read more Photos on
click me!

Recommended Stories