Hair Care: అమ్మ, అమ్మమ్మల్లా రోజూ జడ అల్లుకుంటే ఏమౌతుంది?

Published : Jun 23, 2025, 05:41 PM IST

 ఒకప్పుడు ఎవరు చూసినా..చక్కగా మూడుపాయలతో జడ అందంగా అల్లుకునేవారు. కానీ, ఈ కాలం అమ్మాయిలు అలా కాదు. అసలు జడ అల్లుకునేవారే కనపడటం లేదు.

PREV
15
జడ ఎందుకు అల్లుకోవాలి?

స్త్రీలకు జుట్టు ఇచ్చిన అందం మరేదీ ఇవ్వదనే చెప్పాలి. ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా జుట్టు ఉంటే ఎంత బాగుంటుంది. ఒకప్పుడు అందరికీ అలానే ఉండేవి. ఎవరి జుట్టు చూసినా.. మోకాళ్ల పొడవుగా, ఒత్తుగా ఉండేవి. వాళ్లు కూడా చక్కగా అల్లుకొని, తలనిండా పూలు పెట్టుకునేవారు. కానీ.. ఇప్పుడు ఎవరి తలమీదా సరిగా వెంట్రుకలు ఉండటం లేదు, ఇక పొడవాటి జుట్టు ఉన్నవారు అయితే వందలో ఒకరు ఉండటం కూడా కష్టమైపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ కి అలవాటు పడటం,కాలుష్యం తో పాటు.. మనం జడ వేసుకునే విధానం కూడా కారణమే. నమ్మసక్యంగా లేకపోపయినా ఇదే నిజం.

25
జడ అల్లుకుంటే ఇంత మంచిదా?

ఒకప్పుడు ఎవరు చూసినా..చక్కగా మూడుపాయలతో జడ అందంగా అల్లుకునేవారు. కానీ, ఈ కాలం అమ్మాయిలు అలా కాదు. అసలు జడ అల్లుకునేవారే కనపడటం లేదు. లూస్ గా హెయిర్ వదలడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా కొందరు అయితే.. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతున్నారు.ఇలాంటి వాటి వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. జడ మూడు పాయలతో మంచిగా అల్లుకోకుండా.. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా నష్టం ఉంది. హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మరి, రోజూ జడ అల్లుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా...

ఆరోగ్య నిపుణుల ప్రకారం, జడ అల్లుకోవడం అందానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా ఏంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ జడ అల్లుకునే అలవాటు ఉన్నవారికి శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది.

35
జుట్టు పొడిబారదు..

మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎంత అవసరమో.. జుట్టు కూడా అంతే హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. లేదంటే.. జుట్టు ఎండిపోయినట్లుగా,లుక్ లేకుండా కనపడుతుంది. అలా కాకుండా ఉండాలంటే జడ అల్లుకోవాలి. జడ అల్లుకోకుండా ఎప్పుడూ లూజ్ గా వదిలేసి ఉంచితే పొడిగాలికి, ఎండలకు, కాలుష్యానికి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. జడ అల్లుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉండవు. మంచిగా.. హూడ్రేటెడ్ గా కూడా ఉంచుతుంది.

తల మీది చర్మం..

జుట్టు ఆరోగ్యానికి తల మీది చర్మం కూడా ఆరోగ్యంగా ఉండాలి. తల మీద చర్మం ఎండిపోవడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తాయి. నిత్యం తలకి నూనె మర్దన చేసి జడ వేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే ఇది చుండ్రును నియంత్రించడంలోనూ, జుట్టు క్షీణతను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

45
జుట్టు చిట్లిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది...

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ప్రాసెసింగ్‌లు వాడుతూ జుట్టును నాశనం చేసుకుంటున్నారు. అలాగే జుట్టు స్టైలింగ్ కోసం రోజుకో పద్ధతిలో కట్టడం వల్ల జుట్టు చిట్లిపోతుంది. ఈ ధోరణిని తగ్గించాలంటే, జడలు వేసుకోవడం ఉత్తమ మార్గం. రెగ్యులర్ గా జుట్టు అల్లుకోవడం వల్ల చిట్లిపోయే సమస్య తగ్గుతుంది.

జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది

అధికంగా జుట్టు రాలడం అనేది నేటి తరానికి ప్రధాన సమస్యగా మారింది. దానికి కారణం కాలుష్యం, ఒత్తిడి, పోషకాల లోపం, ఫ్యాషన్ వల్ల కూడా కావచ్చు. జడలు వేసే అలవాటు ఈ సమస్యను కొంతమేర తగ్గించగలదు. ఎందుకంటే, జడల వల్ల జుట్టు ఒక్క దిశలో ఉండి, అసమానంగా ఒడిదుడుకులకు గురికాకుండా ఉంటుంది. ఇది మూలాల వద్ద ఒత్తిడి తగ్గించి జుట్టు బలపడేందుకు దోహదం చేస్తుంది.

55
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జడలు వేసే అలవాటు మీ జుట్టు వేగంగా పెరగడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, జడలు వేసినప్పుడు జుట్టుకు సరైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది జుట్టు మూలాలను ఉత్తేజపరిచి వాటి అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అయితే, గట్టిగా జడ వేయడం మంచిది కాదు. అలా చేస్తే మూలాలు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. వీలైనంత వరకు నార్మల్ గా జడ అల్లుకోవాలి.

తల గుండ్రంగా ఉండడంలో సహాయపడుతుంది

చిన్న వయసులో పిల్లలకు పెద్దలు తరచూ జడ వేస్తూ ఉండేవారు. ఇది కేవలం సంస్కారం కోసమే కాదు, తల గుండ్రంగా ఉండేందుకు కూడా ఒక రకమైన మద్దతుగా పనిచేస్తుంది. జడ మంచిగా వేసుకుంటే.. తల ఆకారం బాగుంటుందని నమ్ముతారు.

నిద్ర సమయంలో కూడా రక్షణ

అనేకమంది మహిళలు రాత్రిళ్లు జుట్టును వదులుగా వదిలేసి నిద్రిస్తారు. కానీ, ఇలా పడుకోవడం వల్ల కూడా హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. కానీ, అలా కాకుండా..రాత్రి పడుకునే ముందు కూడా జడ మంచిగా అల్లుకోవాలి. ఇప్పుడు.. జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది. చిక్కులు పడకుండా ఉంటుంది.

ఫైనల్ గా...

జడలు వేయడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవితానికి, శరీర శ్రేయస్సుకూ మూలస్తంభంగా పనిచేస్తుంది. పాతకాలపు ఈ అలవాటు ఇప్పుడు కనుమరుగౌతున్నా.. దీని వెనక ఉన్న విజ్ఞానాన్ని మరవకూడదు. మీరు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే, ప్రతిరోజూ జడలు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories