
ఫ్యాషన్ లో కలర్ సెలక్షన్ అనేది ఒక మంచి ఆర్ట్. మనం ధరించే రంగులు మన రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, మన శరీర ఆకారాన్ని ఎలా చూపించాలి అనుకుంటున్నాం అనే దానిపైన కూడా ప్రభావితం చూపిస్తాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు లేదా సన్నగా కనిపించాలి అనుకుంటారు.అలాంటివారు వారు ఎంచుకునే దుస్తుల రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, కొన్ని రంగులు శరీరాన్ని పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తాయి. మరి కొన్ని రంగులు ధరించడం వల్ల మనం ఉన్న దానికంటే...ఎక్కువ లావుగా కనిపిస్తాం. మీరు నిజంగా, ఎలా ఉన్నా.. సన్నగా కనిపించాలి అనుకుంటే, కొన్ని రంగులకు దూరంగా ఉండాలి.
రంగులు మన ప్రపోర్షన్ ను ఎలాగైతే మేనేజ్ చేయగలవో,ఆవిధంగా మనల్ని చేసే వారికి మన రూపాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, లావుగా కనిపించకూడదు అంటే.. ఏ రంగులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం...
ఆరెంజ్ అనేది చాలా శక్తివంతమై రంగు. ఇది మనకు ఎనర్జీ, ఆనందం, కాన్ఫిడెన్స్ వంటి భావాలను కలిగిస్తాయి. కానీ, దుస్తుల పరంగా చూస్తే మాత్రం ఇది చాలా మంది శరీర ఆకారానికి సరిపోదు. ఇది గట్టిగా కనిపించే రంగు కాబట్టి, అధిక బరువు ఉన్న వ్యక్తులు లేదా సన్నగా కనిపించాలనుకునేవారు ఈ రంగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఈ రంగు వల్ల ఎక్కువ లావుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. అందుకే, ఈ రంగులకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఈ రంగు కి దూరంగా ఉండటం మంచిది.
ఈ రంగు స్పాట్ లైట్ ను ఆకర్షించడానికి కారణమౌతుంది. ప్రత్యేకించి పొట్ట దగ్గర ఎక్కువ లావుగా కనిపించే అవకాశం ఉంటుంది. కనుక ఆరెంజ్ కలర్ ధరిస్తే, దీనిని సాఫ్ట్ డెనిమ్, డార్క్ బ్లూ కలర్ లాంటి బేసిక్ షేడ్స్ తో బ్యాలెన్స్ చేస్తూ ధరించడం ఉత్తమం. ఇక.. ఈ కలర్ కి జిగేల్ అనే యాక్ససరీస్ కాకుండా.. మినిమల్ గా, బ్యాలెన్స్డ్ ఫీలింగ్ వచ్చే వాటిని ఎంచుకోవాలి. అప్పుడు నార్మల్ గా కనపడే అవకాశం ఉంటుంది.
మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా సన్నగా కనిపించాలి అనుకుంటే వీలైనంత వరకు బ్రౌన్ కలర్ ని దూరం పెట్టాలి. ఎందుకంటే.. ఈ రంగు మన శరీరాన్ని పూర్తిగా, వెడల్పుగా చూపించగలదు. ముఖ్యంగా మందపాటి ఫ్యాబ్రిక్ తో ఉన్న బ్రౌన్ కలర్ డ్రెస్ ధరిస్తే.. మరింత ఎక్కువ బరువు కనిపిస్తారు. లేదు.. మీకు బ్రౌన్ కలర్ అంటే ఇష్టం ఉండి, ఆ రంగు డ్రెస్ ధరించాలి అనుకుంటే.. కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ డ్రెస్ మెటీరియల్ పై దృష్టి పెట్టాలి. అంటే శాటిన్, సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. దాని వల్ల కొంచెం లుక్ లో మార్పు వస్తుంది. ఇక.. వీటికి కాంబినేషన్ గా బ్లాక్ జీన్స్, నేవి బ్లూ స్కర్ట్ లాంటివి కాంబినేషన్ లో వాడితే.. లుక్ బ్యాలెన్స్ అవుతుంది.
ముత్యం రంగులో కనిపించే తెలుపు రంగు చాలా క్లాసీగా ఉంటుంది. ఎందరిలో ఉన్నా మిమ్మల్ని ఎలిగెంట్ గా చూపిస్తుంది. సిల్వర్ కలర్ కూడా అంతే క్లాసీగా ఉంటుంది.కానీ.. ఈ రంగులు ధరించినప్పుడు మనకు తెలీకుండానే బరువు ఎక్కువగా ఉన్నవారిలా కనిపిస్తాం. సిల్వర్ , బూడిద రంగు, ముత్యం రంగులో ఉండే తెలుపు వంటి రంగులు మన లుక్ ని ఎక్కవ ప్రభావితం చేస్తాయి. అందులోనూ.. వాటిని ఎంచుకునే ఫ్యాబ్రిక్ కూడా చాలా ముఖ్యం. కాటన్, లెనిన్ వంటి ఫ్యాబ్రిక్ లు మన లుక్ ని భారీగా చూపిస్తాయి. తెలీకుండానే హెవీగా కనిపిస్తాం. కాబట్టి.. ఈ రంగులు ధరించాలి అంటే.. మోనోక్రోమాటిక్ లుక్స్, మృదువైన ఫ్యాబ్రిక్ ని ఎంచుకోవాలి. అప్పుడు మంచి ఆకారంలో కనిపిస్తారు.
ఈ కలర్ అమ్మాయిలకు చాలా విపరీతంగా నచ్చే రంగు. ఇది గులాబీ రంగు, ఊదా రంగు రెండింటికీ కాస్త మధ్యలో ఉంటుంది. చాలా మంది అమ్మాయిల స్కిన్ టోన్ కి ఈ రంగు చాలా బాగా సూట్ అవుతుంది. కానీ.. ఈ రంగు దుస్తులు వేసుకునే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రంగులు ధరించినప్పుడు ఉన్న బరువు కంటే కూడా ఎక్కువగా కనిపిస్తారు.ముఖ్యంగా పొట్ట ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
లిలక్ రంగులో స్కిన్‌టైట్ డ్రెస్సులు, ఫుల్ బాడీ కవర్ దుస్తులు వేసుకుంటే, బాడీ ఆకారాన్ని మరింత ఎక్కువ చూపించగలదు. డీప్ రెడ్ లాంటి హెవీ షేడ్స్‌తో కలిపితే ఈ రంగు మరింత నెగటివ్‌గా మారుతుంది. ఇంకా ఎక్కువ లావుగా కనపడతారు. అందువల్ల, కొంచెం లైట్ కలర్స్ తో జోడించి వేసుకుంటే.. లుక్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
తెలుపు అనేది ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండే రంగు. ఇది శుభ్రత, తాజా అనుభూతిని కలిగించే రంగు. అయితే ఇది శరీరాన్ని సన్నగా కాకుండా హెవీగా చూపించే అవకాశం ఉంది. ఇది వెలుతురు రంగు కాబట్టి, అధిక బరువుతో ఉన్న వారు తెలుపు రంగును సింపుల్‌గా ధరిస్తే, ఆకారాన్ని మరింత బల్కీగా చూపించగలదు.
అందువల్ల, తెలుపును సొగసైన షేడ్స్‌తో కలిపి ధరించాలి. ఉదాహరణకు, తెలుపు షర్ట్‌తో నలుపు బ్లేజర్ వేసుకుంటే సన్నగా కనిపిస్తాం. డిజైన్ లేదా టెక్స్చర్ ఉండే తెలుపు రంగు దుస్తులు కూడా శరీరాన్ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.
చివరి మాట
ప్రతి రంగుకి తనదైన శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తిని మన రూపాన్ని మెరుగుపరిచేలా మార్చుకోవాలంటే, మన శరీర ఆకారాన్ని బట్టి రంగులను ఎలా వాడాలో తెలుసుకోవడం ముఖ్యమైంది. ఫ్యాషన్ అనేది అందరికీ సూటవ్వదు. కాబట్టి, మీ శరీరానికి సరిపోయే ఫాబ్రిక్, షేడ్, డిజైన్, పొడవు మొదలైన అంశాలను బట్టి రంగులను అప్రమత్తంగా ఎంచుకోవాలి. కొన్ని రంగులు సొగసుగా కనిపించినా కూడా, అవి మీ లుక్‌కి హాని చేయవచ్చు. అలా కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటే అందంగా కనిపిస్తారు.