పుచ్చకాయలో విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉన్నాయి. ఇవి.. మన ముఖాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయం చేస్తాయి. వృద్ధాప్యం దరి చేరకుండా, ముఖం పై ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పుచ్చకాయతో మనం తయారు చేసిన టోనర్లు, ఫేస్ ప్యాక్ తయారు చేసి వాటిని రెగ్యులర్ గా ముఖానికి రాస్తే చాలు.కేవలం పది నిమిషాల్లోనే ఫేస్ లో గ్లో వస్తుంది. ఎలాంటి టోనర్లు , ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోలేకపోయినా.. ఆ పుచ్చకాయ తొక్కను ముఖానికి రుద్దినా చాలు. ముఖం మెరుస్తూ, కొత్త మెరుపుతో కనపడుతుంది.