సహజమైన మెరుపు...
నెయ్యి ని రెగ్యులర్ గా ముఖానికి రాసి.. మంచిగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ కణాలను పోషిస్తుంది. ఇలా చేయడం వల్ల... మేకప్ అవసరం లేకుండానే... సహజంగా మెరుస్తూ కనపడుతుంది. దీని వల్ల యవ్వనంగా, అందంగా కనపడతారు.
చర్మ సమస్యలు తగ్గిపోతాయి...
చాలా మందికి ముఖంపై దురద, ర్యాష్ లాంటివి వస్తూ ఉంటాయి. వాతావరణంలోని కాలుష్యం కారణంగా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వడ దెబ్బ, దుమ్మూ, ధూళి కారణంగా అలెర్జీలు వస్తూ ఉంటాయి. ఈ అలెర్జీ కారణంగా చర్మం దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండేందుకు ముఖానికి నెయ్యి రాస్తే సరిపోతుంది.
సహజంగా మాయిశ్చరైజర్...
రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి రాయడం వల్ల అది మంచి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఖరీదైన క్రీములు కూడా ఇవ్వలేనంత తేమను నెయ్యి ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. యవ్వనంగా కూడా కనిపిస్తారు.