
జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ జుట్టు విపరీతంగా రాలిపోవడం మన ఆత్మవిశ్వాన్ని దెబ్బతీస్తుంది. దీంతో.. దీనిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతూ ఉంటారు. అయితే.. పైపై పూతలు ఎన్ని రాసినా వాటి ఫలితం కొంతకాలమే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా లోపలి నుంచి పోషకాలు అందిస్తే... ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు... జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా పాలను కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు... అందంగా పెరుగుతుంది. మరి, అవేంటో చూద్దాం...
పాలల్లో పోషకాలు...
పాలల్లో చాలా పోషకాలు ఉంటాయి. ప్రోటీన్, బయోటిన్, కాల్షియం ముఖ్యమైన విటమిన్లతో నిండిన సహజమైన అమృతం. ఇది జుట్టు మూలలను బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి, తలపై చర్మాన్ని లోపలి నుంచి పోషించడానికి సహాయపడుతుంది. కానీ, ఈ పాలను కొన్ని పదార్థాలతో కలిపినప్పుడు, ఇది సహజంగా జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
పసుపు మెరిసే చర్మానికి మాత్రమే కాదు, ఇది మీ జుట్టుకు కూడా సహాయపడుతుంది. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అంతేకాదు... ఈ పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తలపై మంటను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదంలో పసుపు పాలను హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తే అద్భుతమైన పానీయంగా పరిగణిస్తారు. ఇది బలమైన జుట్టు పెరుగుదలకు ఇది సహాయపడుతుంది.
ఈ డ్రింక్ ఎలా తాగాలి అంటే... ఒక గ్లాసు పాలు వేడి చేసి, అర టీ స్పూన్ పసుపు పొడి, చిటికెడు మిరియాల పొడి కలపాలి. రాత్రి పడుకునే ముందు దీనిని తాగండి. కాలక్రమేనా తల ఆరోగ్యం మెరుగుపడంతో పాటు, చుండ్రు తగ్గుతుంది. మీ జుట్టు అందంగా మెరుగుపడుతుంది.
బాదంలో బయోటిన్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు మెరుపును అందించడంలో సహాయపడుతుంది. బాదం పాలు చాలా పోషకాలతో నిండి ఉండే పానియం. ఇది మీ జుట్టును లోపలి నుంచి బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీని కోసం మీరు 4 నుంచి 5 బాదం పప్పులను 2 ఖర్జూరాలను రాత్రంతా నానపెట్టాలి. ఈ బాదం పప్పులను తొక్కలను తోసేసి, ఖర్జూరం వేసి బ్లెండ్ చేసి... గోరు వెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. ఈ బాదం పాలు తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడంతో పాటు... ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు మూలలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఒక గ్లాసు పాలు వేడి చేసి దానికి 3 నుంచి 4 కుంకుమ పువ్వు దారాలను వేసి కలపాలి. పాలు బంగారు గోధుమ వర్ణంలోకి మారే వరకు 5 నుంచి 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. కావాలంటే... రుచి కోసం తేనె కలుపుకోవచ్చు. ఈ పాలు తాగడం వల్ల కూడా జుట్టు అందంగా మారుతుంది. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.
పాలు, ఖర్జూరం..
జుట్టు ఒత్తుగా పెరగాలంటే పాలు, ఖర్జూరం వాడితే సరిపోతుంది. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరగడానికి సహాయపడతాయి. దీనికోసం నానపెట్టిన ఖర్జూరాలను మెత్తగా రుబ్బుకొని పాలల్లో కలుపుకొని తాగితే సరిపోతుంది.
మెంతులు విస్తృతంగా ఉపయోగించే పదార్ధం. మెంతులు అధిక మొత్తంలో ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
ఒక టేబుల్ స్పూన్ మెంతిని రాత్రంతా నానబెట్టండి. ఉదయం, దానిని మెత్తగా చేసి, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి త్రాగండి. ప్రత్యామ్నాయంగా, మీరు మెంతిని వేయించి పొడి చేసి, ప్రతిరోజూ ఒక చెంచా తీసుకొని పాలతో త్రాగవచ్చు. ఇది అంత రుచిగా లేకపోయినా, ఇది మీ జుట్టు పెరుగుదలకు ప్రయోజనం చేకూరుస్తుంది.