1.కొబ్బరి నూనె...
ఈ నూనె జుట్టుకు అద్భుతమైన బేస్ ఆయిల్ గా పని చేస్తుంది. జుట్టులోని ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి, లోతుగా తేమను అందిస్తుంది. పొడి జుట్టును మృదువుగా మారుస్తుంది. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ ఉండదు.
ఆముదం నూనె
రిసినోలిక్ ఆమ్లం అధికంగా ఉండే ఆముదం నూనె జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది కుదుళ్లను బలపరచి జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆవ నూనె
ఈ నూనె తల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగవడం వల్ల జుట్టు కుదుళ్లకు సరైన పోషణ అందుతుంది. ఫలితంగా కొత్త జుట్టు పెరుగుతుంది.
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర)
కలోంజి గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తల చర్మంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
ఉసిరికాయ (ఆమ్లా)
విటమిన్ C , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఉసిరి జుట్టును నల్లగా, బలంగా , మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య ఉండదు.